టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ టార్గెట్ బొత్స ?

ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ టీడీపీ కూటమి టార్గెట్ గా మారిపోయారు.

Update: 2024-06-09 11:19 GMT

ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ టీడీపీ కూటమి టార్గెట్ గా మారిపోయారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతూనే ఈ సీనియర్ నేత మీద ఫుల్ గా ఫోకస్ పెట్టాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. బొత్స ను ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు గట్టిగా టార్గెట్ చేశారు.

బొత్స వల్లనే ఉత్తరాంధ్రాలో అభివృద్ధి లేకుండా పోయిందని నిందించారు. ఆయనను ఏలాగైనా ఓడించాలని బాబు ఎంతో ఆలోచించారు. సీనియర్లను దింపితే తప్ప బొత్స ఓడరు అని భావించి మొదట గంటా శ్రీనివాసరావు అనుకున్నా తరువాత కళా వెంకటరావుని రంగంలోకి దింపారు. అనుకున్నట్లుగా బొత్స ఓటమి జరిగిపోయింది.

ఇపుడు బొత్స రెండేళ్ళ పాటు చూసిన విద్యా శాఖలో అవినీతి మీద కూటమి దృష్టి పెడుతోంది అని అంటున్నారు. ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారం అందులో అవినీతి జరిగింది అంటూ వస్తున్న వార్తలు ఇపుడు బొత్స మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ విషయంలో అసలు అవినీతి జరగలేదు బొత్స తనదైన వెర్షన్ ఇస్తున్నా కూడా ఆయన భాగస్వామ్యం ఎంతో తేల్చాలని కూటమి పట్టుదలగా ఉంది.

బొత్సకు డబ్బులు ఇచ్చిన ఉపాధ్యాయులు బాహాటంగా చెబుతూండడం కూడా ఆయనకు తలనొప్పిగా మారింది అంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీ పేరిట 50 కోట్ల రూపాయలను బొత్స ఆయన పేషీ అధికారులు వసూల్ చేశారు అని వార్తా కధనాలు వస్తున్నాయి. అయితే సిఫార్సు చేసిన ఈ తరహా బదిలీలు ఆపేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి.

ఆ విధంగా చూస్తే ఎన్నికల ముందు మంత్రి బొత్స కొందరు అధికారులు కలసి ఈ విధంగా దందాలకు తెర తీశారు అని విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ అక్రమ బదిలీలకు అడ్డుకట్టను ప్రభుత్వం వేయగలిగింది. అసలు ఈ బదిలీల ప్రహసం ఎలా జరిగింది అంటే వైసీపీ ఎమ్మెల్యేలు నాయకుల సిఫార్సులతో ఉపాధ్యాయుల నుంచి భారీగానే డబ్బులు దండుకున్నారు అని అంటున్నారు.

అలా మంత్రి పేషీలో పనిచేసే ఒక పీఏ అలాగే పాఠశాలవిద్యా శాఖ కమిషనరేట్, సచివాలయంలో కొందరు అధికారులు అంతా కలసి ఎన్నికల ముందు హడావుడిగా ఈ బదిలీలకు తెర లేపారు అని అంటున్నారు. ఇక ఇవన్నీ సిఫార్సు బదిలీలు అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ లోని ఒక కీలక అధికారి పూర్తి సహకారం అందించారు అని అంటున్నారు.

ఇలా విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడంతో ఎకడమిక్ ఇయర్ క్లోజింగ్ డేన పాత పాఠశాల నుంచి రిలీవ్ అయి కొత్తగా బదిలీ అయిన చోట చేరాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే అనుకున్నది ఒకటి అయితే జరిగినది వేరొకటి అన్నట్లుగా అంతా జరిగింది.

ఈ మొత్తం పరిణామంతో సొమ్ములు పాయే పని జరగలా అంటూ ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఈ వ్యవహారం గుట్టుగానే ఉండేది. అక్రమ బదిలీలను సక్రమం చేసుకునేవారు. కానీ టీడీపీ కూటమి రావడంతో డబ్బులిచ్చుకున్న వారంతా గగ్గోలు పెడుతున్నారు.

వారు ఆధారాలు అన్నీ కూటమి నేతలకు ఇవ్వడంతో బొత్స సహా కీలక అధికారుల మీద విచారణకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. తొలిగా మాజీ మంత్రి బొత్స మీదనే ఫోకస్ అని అంతా అంటున్నారు. మరి బొత్స ఇపుడు చక్రబంధంలో అలా చిక్కుకుని పోయారు. ఆయన తప్పించుకునే మార్గం ఏది అన్నదే తెలియడంలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా బొత్స టార్గెట్ కావడంతో ఉత్తరాంధ్రా వైసీపీలో రాజకీయ కలకలమే రేగుతోంది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని బొత్స అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News