కర్ణాటక సెక్స్ కుంభకోణం: కొడుకు చేసిన పాపం.. రేవణ్ణ అరెస్టు..!
ఆయన పెట్టుకు న్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు తిరస్కరించింది.
కర్ణాకటలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చేసి సెక్స్ కుంభకోణం.. ఆ కుటుంబాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రజ్వల్ ను జేడీఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా.. ఈ సెక్స్ కుంభకోణం తాలూకు నీలి నీడలు మాత్రం.. ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రేవణ్ణను తాజాగా సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పెట్టుకు న్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు తిరస్కరించింది. దీంతో రేవణ్ణను అరెస్టు చేశారు.
బెంగళూరులోని పద్మనాభనగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఇంట్లో ఉన్న సమయం లోనే రేవణ్ణ(దేవెగౌడ పెద్ద కుమారుడు)ను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ సమయంలో రేవణ్ణ పోలీసులకు సహకరించారు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్.. హాసన్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచే మరోసారి బరిలో ఉన్నాడు. అయితే.. ఈయన ఏకంగా 3000 మందికిపైగా మహిళలను వాడుకున్నాడనేది అభియోగం.
వీరిలో 700 మంది మహిళలతో సెక్స్ చేస్తూ.. తీసుకున్న సెల్ఫీ వీడియోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. రేవణ్ణను ఎందుకు అరెస్టు చేశారనేది ప్రశ్న. ప్రజ్వల్ ఇంట్లో గతంలో పనిచేసిన ఓ పనిమనిషిని రెక్కలు కట్టేసి పదే పదే అత్యాచారం చేశాడు ప్రజ్వల్. దీనిని కూడా వీడియోలు తీసుకున్నాడు. ఈ వేధింపులు భరించలేక.. పైకి చెప్పలేక.. ఆమె పనిమానేసింది. అయితే.. తాజా ఘటనల నేపథ్యంలో ఆమె ఎక్కడ సాక్ష్యం చెబుతుందోనని దేవెగౌడ కుటుంబం ఆవేదనలో ఉంది.
ఈ క్రమంలోఆమెను రేవణ్ణ ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఇక, అప్పటి నుంచి ఆ పనిమనిషి కనిపించడం లేదు. దీనిపై ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ స్థలాలు.. పొలాలు కూడా రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ లాగేసుకుని. తన తల్లిపై అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవణ్ణకు దీనిలో పాత్ర ఉందని ఆరోపించాడు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు రేవణ్ణకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి.. బెయిల్ పొందాలని భావించారు. కానీ, బెయిల్ దక్కక పోవడంతో ఆయనను అరెస్టు చేశారు.