ఢిల్లీలో సంచలనంగా ట్రిపుల్ మర్డర్... తల్లితండ్రులు, కూతురి హత్య!

ఒకే కుటుంబంలోని ముగ్గురు ఇంట్లోనే హత్యకు గురవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది!

Update: 2024-12-04 11:30 GMT

ఒకే కుటుంబంలోని ముగ్గురు ఇంట్లోనే హత్యకు గురవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది! దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో భర్త, భార్య, కుమార్తె హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

అవును... ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. ఇందులో భాగంగా... ఇంట్లోనే ఒకే కుటుంబానికి చెందిన తల్లితండ్రులు, కుమార్తెను కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. అయితే.. హత్య జరిగిన సమయంలో కొడుకు మార్నింగ్ వాకింగ్ కు వెళ్లినట్లు చెబుతున్నారు. వాకింగ్ నుంచి తిరిగి వచ్చి చూసేసరికి ముగ్గురూ హత్యకు గురయ్యారు.

ఈ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే... తాను ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లాలని, వచ్చి చూసే సరికి తండ్రి రాజేష్ (55), తల్లి కోమల్ (47), సోదరి కవిత (23) మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయని చెప్పాడని అంటున్నారు.

ఈ రోజు (డిసెంబర్ 4)న తన తల్లితండ్రుల వివాహ వార్షికోత్సవం అని చెప్పిన కుమారుడు.. తాను తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి, వాకింగ్ కి వెళ్లిపోయినట్లు తెలిపారని చెబుతున్నారు. తిరిగి 7 గంటల ప్రాంతంలో వచ్చేసరికి ముగ్గురూ హత్యకు గురై ఉన్నారని తెలిపాడు! దీంతో.. కేకలు వేసేసరికి, చుట్టుపక్కల జనం గుమిగూడారని అంటున్నారు.

మృతిచెందిన ఈ ముగ్గురు మెడపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక... రాజేష్ స్వస్థలం హర్యానా కాగా.. అతను చాలా ఏళ్ల క్రితమే ఢిల్లీకి వచ్చి నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీ గ్రామంలో నివసిస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News