ట్రంప్ రాక.. హెచ్-1బీ వీసా కాక.. సవాళ్లు తప్పదటగా?

అవును... "అమెరికా ఫస్ట్" అనే నినాదాన్ని ఎంచుకుని ఎన్నికల ప్రచారం చేపట్టిన ట్రంప్ మాటలకు అగ్రరాజ్యం ప్రజలు బలంగా నమ్మారు.

Update: 2024-11-07 05:43 GMT

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో... భారత్ కు కలిసొచ్చే అంశాలు, ఎదురయ్యే సవాళ్లు, ఎదుర్కోవడం తప్పని సమస్యలపై చర్చ బుధవారం ఫస్టాఫ్ నుంచే మొదలైపోయింది. ఈ సమయంలో వాటిలో ప్రధానంగా హెచ్-1బీ వీసా విషయంలో ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చకు వచ్చింది!

అవును... "అమెరికా ఫస్ట్" అనే నినాదాన్ని ఎంచుకుని ఎన్నికల ప్రచారం చేపట్టిన ట్రంప్ మాటలకు అగ్రరాజ్యం ప్రజలు బలంగా నమ్మారు. దీంతో.. ఆ మాటకు కట్టుబడి ఉండటంపై ట్రంప్ ఫోకస్ పెడతారని అంటున్నారు. ఈ సమయంలో... గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ ఆంక్షల విషయంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు.

2016 ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారిగా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్... ఇమ్మిగ్రేషన్ విషయంలో మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వీటిలో హెచ్-1బీ వీసా ప్రోగ్రాం కూడా ఉంది. ఇది... చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులకు, గ్రాడ్యుయేషన్ తర్వాత యూఎస్ లో ఉండి పనిచేయాలనుకునేవారికి కీలకంగా మారింది.

ప్రధానంగా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఎత్తుకున్న ట్రంప్.. విదేశీయుల కంటే అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. వీసాల విషయంలో కఠినమైన నిబంధనలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ముఖ్యంగ భారత్ నుంచి వచ్చి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, యూఎస్ లోనే ఉండి పనిచేయాలనుకునేవారికి సవాల్ అని చెబుతున్నారు!

ఇదే క్రమంలో... ఎక్కువమంది అమెరికన్లను నియమించుకునేలా కంపెనీలను బలవంతం చేసే విధానాలను ట్రంప్ ముందుకు తీసుకురవొచ్చని.. విదేశీ కార్మికులు ఎంతకాలం ఉండొచ్చో పరిమితి కూడా విధించొచ్చని చెబుతున్నారు. ట్రంప్ రాక వల్ల.. చదువు తర్వాత అమెరికాలో ఉండాలనే అంతర్జాతీయ విద్యార్థులకు గణనీయమైన కష్టాన్ని కలిగించే చాన్స్ ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News