జగన్ తాజా రాజకీయ నిర్ణయాలపై ఉండవల్లి హాట్ కామెంట్స్!

దీంతో అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి

Update: 2023-12-23 09:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం రోహిణీ కార్తీ ఎండలను తలపించే స్థాయిలో హీటెక్కుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ ఎన్నికల సమరంలోకి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ ల మార్పు జరిగింది. ఇది మరికొన్ని నియోజకవర్గాలకు వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు.

దీంతో అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే... ఇది గుడ్డిగా తీసుకుంటున్న నిర్ణయం కాదని... ఇందులో కార్యకర్తల సూచనలు, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలతోపాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో జగన్ తాజా రాజకీయ నిర్ణయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఇన్ ఛార్జ్ లను మర్చే నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ... సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఇందులో భాగంగా... 80 - 100 సీట్లు మారుస్తున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.. అది నిజమైతే చాలా చాకచక్యంగా చేయాలని ఉండవల్లి తెలిపారు.

ఈ సమయంలో జగన్ నిర్ణయం నచ్చక పార్టీ మారి ఎవరైనా వెళ్లిపోతే.. అతడు వెళ్లిపోతూ వెళ్లిపోతూ కొన్ని ఓట్లు తీసుకుపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో... పార్టీని వీడి వెళ్లే వ్యక్తి తీసుకుపోయే ఓట్లకంటే... కొత్తగా వచ్చే వ్యక్తి, కొత్తగా ఎంపికయ్యే వ్యక్తి అంతకు రెట్టింపు ఓట్లు తెస్తాడనే నమ్మకం ఉంటే ఇన్ ఛార్జ్ ల మార్పు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దీన్ని చాలా చాకచక్యంగా చేయాలని అన్నారు.

ఇదే సమయంలో టిక్కెట్లు మార్చకపోవడం వల్ల తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారు.. టిక్కెట్లు మార్చడం వల్ల ఏపీలో జగన్ దెబ్బతిన్నాడనే మాటమాత్రం రాకుండా చూసుకోవాలని సూచించారు. దీంతో ఈ సూచనలు చర్చనీయాంశం అయ్యాయి.

Tags:    

Similar News