యూఎస్ స్టూడెంట్ వీసా అప్లికేషన్ల తిరస్కరణ... తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువట

అయితే.. తాజాగా బయటకు వచ్చిన నివేదిక చెబుతున్న కొత్త అంశం ఏమంటే.. గడిచిన కొంతకాలంగా విద్యార్థి వీసా (ఎఫ్ 1)లకు అమెరికా ప్రభుత్వం కత్తెర వేస్తోంది.;

Update: 2025-04-06 07:27 GMT
యూఎస్ స్టూడెంట్ వీసా అప్లికేషన్ల తిరస్కరణ... తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువట

ఆసక్తికర నివేదిక ఒకటి బయటకు వచ్చింది. ఉన్నత విద్య కోసం అమెరికా కలలు కనే భారతీయ విద్యార్థులు ఎక్కువనే విషయం తెలిసిందే. ప్రతి ఏటా లక్షలాది మంది అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళుతుంటారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. అయితే.. తాజాగా బయటకు వచ్చిన నివేదిక చెబుతున్న కొత్త అంశం ఏమంటే.. గడిచిన కొంతకాలంగా విద్యార్థి వీసా (ఎఫ్ 1)లకు అమెరికా ప్రభుత్వం కత్తెర వేస్తోంది.

కొత్తగా వచ్చే దరఖాస్తుల్ని రిజెక్టు చేస్తోంది. ఇలా తిరస్కరించే అప్లికేషన్లలో ఎక్కువ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తులుగా చెబుతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ స్థాయిలో వీసాల తిరస్కరణ ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఆడ్మిషన్ లభించినా.. వీసాల్ని రిజెక్టు చేస్తుండటంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

విద్యార్థులకు ఉన్నత విద్య కోసం జారీ చేసే ఎఫ్ 1 వీసా నాన్ ఇమిగ్రెంట్ అన్నది తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో పూర్తిస్థాయిలో విద్యను అభ్యసించేందుకు ఈ వీసాను అనుమతిస్తుంటారు. అమెరికాలో ప్రతి ఏటా రెండు సార్లు ఆడ్మిషన్ల కోసం వీసాలు జారీ చేస్తారు. అందులో ఆగస్టు - డిసెంబరు సెమిస్టర్ సమయంలో మన విద్యార్థులు ఎక్కువగా వెళుతుంటారు.దీనికి కారణం.. వారు చేస్తున్న కోర్సు ఫలితాలు రావటం.. మిగిలిన అంశాల్ని చూసుకోవటానికి ఈ సమయం బాగుంటుంది కాబట్టి.

అయితే.. గత ఆర్థిక సంవత్సరంలో 41 శాతం వీసా అప్లికేషన్లను అమెరికా తిరస్కరించింది. దీనికి ఫలానా కారణమన్న విషయాన్ని వెల్లడించకపోవటం తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో వచ్చిన మార్పు ఏమంటే.. గతంలో దరఖాస్తు చేసే విషయంలో చిన్న చిన్న పొరపాట్లు.. తప్పులను చూసిచూడనట్లుగా వదిలేసే వారని..ఇప్పుడు మాత్రం అందుకుభిన్నంగా చాలా జాగ్రత్తగా అప్లికేషన్లను చెక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇక.. ఈ వాదనకు బలం చేకూరే అధికారిక గణాంకాల్ని చూస్తే 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్1 వీసాల కోసం అమెరికా విదేశాంగ శాఖకు 6.79 లక్షల అప్లికేషన్లు రాగా.. అందులో 2.79 లక్షల అప్లికేషన్లను రిజెక్టు చేశారు. అమెరికా వీసాలు ఎక్కువగా తిరస్కరణకు గురి కావటంతో విదేశాల్లో చదువుకోవాలని భావించే విద్యార్థులు యూకే.. జర్మనీ లాంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి.

Tags:    

Similar News