సంప్రదాయ బోగీలకు.. వందేభారత్ బోగీలకు తేడా తెలిస్తే ఆశ్చర్యమే

ఆ ఇంజిన్ వెనుక బోగీలను కలుపుకోవచ్చు. కానీ.. వందేభారత్ లో మాత్రం ఇంజనే ఉండదు. అదే దాని ప్రత్యేకత

Update: 2024-10-05 06:29 GMT

ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. భారత రైల్వేల్లో సంచలనంగా మారిన వందేభారత్ బోగీలకు.. సంప్రదాయ బోగీలకు మధ్యనున్న తేడాకు సంబంధించిన సాంకేతిక అంశం గురించి ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగు చూశాయి. సాధారణ రైళ్లలో ఇంజన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ ఇంజిన్ వెనుక బోగీలను కలుపుకోవచ్చు. కానీ.. వందేభారత్ లో మాత్రం ఇంజనే ఉండదు. అదే దాని ప్రత్యేకత.

మరి.. ఇంజన్ లేకుండా ఎలా అంటే.. అక్కడే ఉంది అసలు విషయం. వందే భారత్ బోగీలను చిన్నచిన్నగా విడదీసి.. కోచ్ కిందనే ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఒక్కో బోగీకి ఆరు చక్రాలు ఉంటాయి. వాటికి జత చేసిన ఆరు మోటార్లు రైలును నడుపుతాయి. పదహారు బోగీలున్న వందేభారత్ లో 8 బోగీలకు 32 మోటార్లు ఉంటాయి. దీని కారణంగానే కుదుపులు లేకుండా.. సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేసే వీలుంటుంది. వందే భారత్ ప్రతి రైలులోనూ కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వందే భారత్ రైళ్లకు మన దేశంలోనే కాదు చిలీ.. దక్షిణాఫ్రికా దేశాల్లోనూ ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఎగుమతికి అవకాశం ఉంది. ఇప్పటికే రైల్వే బోర్డు 24 బోగీలతో ఉన్న 50 వందే భారత్ రైళ్లను ఆర్డర్ ఇచ్చింది. వాటిని సప్లై చేయటానికే రెండేళ్లు పట్టే వీలుంది. మరోవైపు స్లీపర్ వెర్షన్ తయారీలో ఉంది. ప్రస్తుతం 10 రైళ్లను తయారు చేస్తున్నారు. తయారీ తర్వాత బెంగళూరు నుంచి చున్నైకు తీసుకెళ్లి వాటిని పరీక్షిస్తారు. అక్కడి నుంచి లక్నోలోని ఆర్డీఎస్ వోలో పరీక్షించి.. అక్కడి సవాళ్లను అధిగమించిన తర్వాతే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. స్లీపర్ వందే భారత్ లు మొత్తం 16 బోగీల రైళ్లే.

వందే భారత్ రైలు డిజైన్ వేగం 180కిలోమీటర్లు. ఈ కారణంగానే ఢిల్లీ - ఝూన్సీ మధ్య ట్రాక్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో గంటకు 160కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతోంది. అయితే.. చెన్నై - విశాఖపట్నం మధ్య ట్రాక్ కు అంత సీన్ లేదు. ఈ కారణంగానే దాని సామర్థ్యానికి ఉన్న పరిమితుల నేపథ్యంలో వందే భారత్ గంటకు 130కిలోమీటర్ల వేగంతోనే పరుగులు తీస్తోంది.

Tags:    

Similar News