సాయిరెడ్డి కొత్త శకం.. ఇక, తిరుగులేదులే... !
కానీ, ఇదే వైసీపీ వ్యూహం. సాయిరెడ్డి ద్వారా.. మోడీకి మేలు చేయించి.. తద్వారా.. వైసీపీకి పరోక్ష మేళ్లు అందుకోవాలనేది ప్రధాన ఉద్దేశం.
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక మీదట మరో లెక్క.. అన్నట్టుగా రాజకీయాలు ఉండనున్నాయి. కేంద్రంలో వైసీపీకి పలుకుబడి పెంచడంలోనూ.. తమ ప్రాధాన్యాన్ని వివరించడంలోనూ.. సాయిరెడ్డి ఆది నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గతానికి ఇప్పటికి తేడా ఉంది. గతంలో పార్టీ ఏపీలో బలంగా ఉంది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
పైగా..ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది చెప్పడం కూడా కష్టంగానే ఉంది. ఈ క్రమంలో సాయిరెడ్డి పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. కేంద్రంలో చక్రం తిప్పడం ద్వారా.. సాయిరెడ్డి .. వైసీపీని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పైగా.. మోడీ సహా.. అమిత్‌షా వంటివారితోనూ సాయిరెడ్డికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రాజకీయంగా వారిని మెప్పించడంలోనూ.. వైసీపీ వ్యవహారాలను చక్క బెట్టడంలోనూ సాయిరెడ్డి కీలక రోల్ పోషిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయనకు మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుపై వేసిన స్థాయి సంఘంలోనూ.. కీలక పదవిని అప్పగించింది. దీని కోసం ఎంతో మంది పోటీ పడినప్పటికీ.. సాయిరెడ్డిని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. దీంతో మోడీకి నొప్పి లేకుండా.. సాయిరెడ్డి చక్కదిద్దడం ద్వారా.. ఈ వ్యవహారంలో వైసీపీ గ్రాఫ్‌ను మరింత పెంచాలన్నది జగన్ సూచన. దీనికి అనుగుణంగానే సాయిరెడ్డి పనితీరు కూడా ఉండనుంది. ప్రస్తుతం ఈ విషయమే జాతీయ మీడియాలోనూ చర్చకు వచ్చింది.
మైనారిటీలకు అనుకూలంగా ఉన్న వైసీపీ నుంచి సాయిరెడ్డిని నియమించారని.. ఢిల్లీలోనూ చర్చ జరుగుతోంది. కానీ, ఇదే వైసీపీ వ్యూహం. సాయిరెడ్డి ద్వారా.. మోడీకి మేలు చేయించి.. తద్వారా.. వైసీపీకి పరోక్ష మేళ్లు అందుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. ఇలా.. సాయిరెడ్డి ప్రతిభను కేంద్రంలో వినియోగించుకుని తద్వారా.. రాష్ట్రంలో తమకు ఇబ్బందులు లేకుండా, రాకుండా కూడా చూసుకోవాలన్నది జగన్ భావన. ఫలితంగా సాయిరెడ్డి ప్రభ దూసుకుపోతుండడం గమనార్హం.