తెలుగులో జీవోలు...కూటమికే క్రెడిట్!

ఇక పాలనా పరంగా చూస్తే వాట్సప్ ద్వారానే విన్నపాలు చేసుకుంటే కుల దృవీకరణ పత్రాలతో పాటు అన్నీ వచ్చేలా చూస్తోంది.

Update: 2024-12-30 04:28 GMT

ఏపీలో తెలుగుదేశం కూటమి పాలన సాగుతోంది. గతంలో తీసుకోని కొన్ని కీలక నిర్ణయాలను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది. సామాజిక పెన్షన్ల విషయంలో చూస్తే చాలా నిర్ణయాలను తీసుకున్నారు. మూడు నెలల పెన్షన్ ఒకేసారి చెల్లింపు అయితేనేమి అలాగే భర్త మరణిస్తే మరుసటి నెలలోనే భార్యకు ఆ పెన్షన్ వర్తింపచేయాలని నిర్ణయించడం అయితేనేని కూటమి భేష్ అనిపించుకుంది.

ఇక పాలనా పరంగా చూస్తే వాట్సప్ ద్వారానే విన్నపాలు చేసుకుంటే కుల దృవీకరణ పత్రాలతో పాటు అన్నీ వచ్చేలా చూస్తోంది. అలాగే డ్రోన్ ఏఐ సాయంతో కూడా కొత్త పాలనను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మాతృ భాష అయిన తెలుగు విషయంలో కూడా కూటమి ప్రభుత్వం తనదైఅన్ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇక మీదట ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అన్నీ కూడా తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.

ప్రపంచ తెలుగు మహా సభలు విజయవాడలో జరుగుతున్న వేళ మంత్రి సత్యకుమార్ యాదవ్ దీని మీద కీలక ప్రకటన చేశారు. మన తెలుగు భాషను మనమే కాపాడుకోవాలని ఆయన అన్నారు లేకపోతే ఇబ్బందులు పడతామని చెప్పారు

తెలుగులో ప్రభుత్వ జీవోలు వెలువరించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. ఇప్పటిదాకా ఆంగ్లంలో జీవోలు వస్తున్నాయని వాటిని గూగుల్ ట్రాన్సిలేషన్ చేస్తే సరిగ్గా ఆర్ధం కాక అసలు భావాలే పోతున్నాయని చెప్పారు.

అందువల్ల సామాన్యుల నుంచి అందరికీ అర్ధం అయ్యేలా తెలుగులో జీవోలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో తెలుగుని పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు

మైసూరులో తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఉండేదని దానిని 2020లో ఏపీకి తీసుకుని వచ్చారుని అయినా దానిని భవనం కేటాయించడానికి వైసీపీ కృషి చెయ్యలేదని ఆయన ఆక్షేపించారు. అయితే ప్రాచిన తెలుగు భాషా అధ్యయన కేంద్రానికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, త్వరలోనే అందుబాటులోకి సొంత భవనం వస్తుందని చెప్పారు.

అంతే కాకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి గుర్తు చేసారు. భవిష్యత్తులో ప్రాంతీయ భాషలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. అలాగే అంతట సెల్ ఫోన్ ల వినియోగం పెరిగిందని వాటి ద్వారా కూడా తెలుగు వంటి ప్రాంతీయ భాషల అభివృద్ధికి వాడుకోవచ్చునని అన్నారు. మొత్తానికి చూస్తే తెలుగులో జీవోలు రిలీజ్ చేయడం కనుక జరిగితే తెలుగు ప్రాముఖ్యత మరింతగా పెరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News