కుమార్తె విషయంలో జగన్ భావోద్వేగం... వైరల్ పిక్!

ఈ సమయంలో ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి తన కుమార్తె వర్షారెడ్డి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2025-01-17 04:40 GMT

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం కుటుంబంతో సహా లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన.. తన కుమార్తె డిగ్రీ పట్టా పుచ్చుకున్న సందర్భంగా ఆన్ లైన్ వేదికగా స్పందించారు. దీనికి సంబంధించిన పోస్ట్, పిక్ వైరల్ గా మారాయి.

 

అవును... ఏపీ మాజీ సీఎం జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి తన కుమార్తె వర్షారెడ్డి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సతీమణి వైఎస్ భారత్, ఇద్దరు కుమార్తెలతో దిగిన ఫోటోను పంచుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన జగన్... “అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్ లో చదివి పట్టభద్రురాలవడంతోపాటూ.. డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణం అయ్యావు.. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

కాగా... వర్షారెడ్డి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ ఇటీవల తన సతీమణితో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిరువురూ ఈ నెలాఖరులోగా తిరిగి భారత్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క వర్ష విషయంలో జగన్ కు హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News