కెనడాలో ఇండియన్స్ సింగర్స్ ఇళ్ల వద్ద 100 రౌండ్ల కాల్పులు.. వివరాలివే!
గత కొంతకాలంగా భారత్ - కెనడా లమధ్య దౌత్యపరమైన పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలిసిన విషయమే.
గత కొంతకాలంగా భారత్ - కెనడా లమధ్య దౌత్యపరమైన పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలిసిన విషయమే. గతంలో ఎన్నడూ లేనంతా పతనావస్థలో ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఉన్నాయి. దీనికంతటికీ ఆ దేశ ప్రధాని ట్రూడో అని భారత్ బలంగా చెబుతోంది. ఈ సమయంలో కెనడాలోని భారతీయులపై ఓ అనూహ్య ఘటన జరిగింది.
అవును... ప్రస్తుతం భారత్ – కెనడా లమధ్య దౌత్య సంబంధాలు దారుణంగా పతనమైపోయిన నేపథ్యంలో... కెనడాలోని టొరంటోలో ఓ కీలక ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. అక్కడ భారతీయ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఈ కాల్పుల ఘటన రికార్డింగ్ స్టూడియో వెలుపల జరిగిందని అంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కెనడాలోని టొరంటోలో ముగ్గురు దుండగులు చోరీ చేసిన ఓ వాహనంలో రికార్డింగ్ స్టూడియో పరిసర ప్రదేశానికి వచ్చారు. ఆ తర్వాత స్టూడియో బయట కాల్పులకు దిగారు. దీనికి ప్రతిగా.. స్టూడియోలో ఉన్నవారు కూడా ఎదురుకాల్పులు చేశారని అంటున్నారు. ఈ సమయలో దుండగులు సుమారు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కెనడా పోలీసులు సుమారు 23 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వారినుంచి 16 ఆయుధాలను రికవరీ చేసుకున్నారని అంటున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఇండియన్ ఏజెన్సీలు నిఘా పెట్టాయి.
ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో మ్యూజిక్ స్టూడియోలతో పాటు పలువురు పంజాబీ సింగర్స్ ఇళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా... ఇటీవల కెనడాలోని వాంకోవర్ లో ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ థిల్లన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగినట్లు తేలిన సంగతి తెలిసిందే.