ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్ అమ్మాయి మిన్హజ్‌ జైదీకి ఆఫర్‌!

అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయంగా ఉన్న హైదరాబాద్‌ కు చెందిన యువతి సయ్యదా లులు మిన్హజ్‌ జైదీ

Update: 2023-08-06 11:45 GMT

మాస్టర్స్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లిన అమెరికా అమ్మాయి తీవ్ర డిప్రెషన్ కి గురైందని.. ఆమె మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యిందని.. ఫుల్ డిప్రెషన్ లో ఉందని.. ఆకలితో అలమటిస్తోందని.. చికాగో రోడ్లపై కనిపించిందని కొన్ని ఫోటోలు ట్విట్టర్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమ్మాయికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ వెల్లడైంది.

అవును... అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయంగా ఉన్న హైదరాబాద్‌ కు చెందిన యువతి సయ్యదా లులు మిన్హజ్‌ జైదీ గురించిన విషయం పదిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడౌన్న తెలుగువారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఇండియాకు తెలియపరిచారని తెలిసింది.

అయితే తాజగా ఆమెను ఇంటికి చేర్చేందుకు భారత కాన్సులేట్‌ జనరల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆమెకు అవసరమైన వైద్యసాయంతోపాటు.. భారత్‌ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని భారత దౌత్యవర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా ఇండియన్ కాన్సులేట్‌ ట్విటర్లో పేర్కొంది. "మేము సయ్యదా లులు మిన్హజ్‌ జైదీని సంప్రదించగలిగాము. ఆమెకు అవసరమైన వైద్యం, భారత్‌ వెళ్లేందుకు సాయం అందిస్తామని చెప్పాము. ఆమె ఫిట్‌ గా ఉన్నారు. భారత్‌ లో ఉన్న తల్లితో కూడా ఆమె మాట్లాడారు. ఆమెకు అవసరమైన ఎటువంటి సాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం" అని తెలిపింది.

కాగా హైదరాబాద్ మౌలాలీకి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఆగస్టు 2021 లో డెట్రాయిట్ వెళ్లింది. ఆ సమయంలో ఆమె తరచూ తల్లి సయ్యదా వహాజ్‌ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతుండేవారు. కానీ.. రెండు నెలలుగా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కి టచ్ లో లేరు!

ఈ సమయంలో తాజాగా ఆమె చికాగో రోడ్లపై అసహజంగా కనిపించడంతో ఇద్దరు హైదరాబాద్ యువకులు ఆ విషయాన్ని ఆమె తల్లికి తెలియజేశారు. దీంతో... తన కూతుర్ని ఇండియాకు రప్పించేలా తమకు సాయం చేయమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ ను వేడుకుంటూ లేఖ రాసింది ఆమె తల్లి.

దీంతో భారత కాన్సులేట్‌ జనరల్‌ ఆమె కోసం సెర్చ్ చేసింది.. ఫైనల్ గా ఆమెను కాంటాక్ట్ చేయగలిగింది.. ఇందులో భాగంగా తాజాగా ఆమెకు సంబంధించిన వివరాలను ఈ విధంగా ట్విట్టర్ లో పేర్కొంది!

Tags:    

Similar News