తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి రూ.170కోట్లు.. ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా విరాళంగా జమ అయినట్టు సమాచారం. దీంతో ఏపీలోని ముఖ్యనాయకుడికి, విరాళంగా ఇచ్చిన సదురు భారీ కాంట్రాక్టు సంస్థకు త్వరలోనే ఐటీ నోటీసులు వెళ్లబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు హయాంలో ఏపీలో భారీ ప్రాజెక్టులు సంపాదించిన కాంట్రాక్టు సంస్థ ఏపీలోని ఓ ముఖ్యుడికి రూ.150 కోట్లు లంచంగా ఇచ్చిందన్న వార్త అప్పట్లో ఐటీ శాఖ లీక్ చేసి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు పొక్కాయి..
ముంబైకి చెందిన మల్టీనేషనల్ కాంట్రాక్టు సంస్థ కు చంద్రబాబు ఐదేళ్ల పదవీ కాలం లో దాదాపు 2230కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు అప్పగించారని ఐటీ శాఖ వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. ఇందుకుగాను చంద్రబాబు ప్రభుత్వం అప్పటికే 700 కోట్లు చెల్లింపులు చేసిందట.. దానికి గాను 170 కోట్ల రూపాయాలను హైదరాబాద్ ద్వారా విజయవాడకు విరాళంగా వెళ్లాయంటున్నారు ఐటీ అధికారులు. తెలుగుదేశం పార్టీకి విరాళంగా ఈ మొత్తం అందినట్టు ప్రచారం సాగుతోంది.
ఇంతకీ ఆ 170 కోట్ల విరాళం డీల్ చేసిన ప్రముఖుడు ఎవరు? ఆ 170 కోట్లు అందుకున్న ప్రముఖుడు ఎవరు.? ఐటీ నోటీసులు ఎవరికి ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మొత్తంగా త్వరలోనే ఐటీ నోటీసులు సంస్థకు ఆ ముఖ్య నాయకుడి కి వెళ్లబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.