రాజస్థాన్ కు చెందిన 56 ఏళ్ల బద్రిలాల్ మీనా అనే రైల్వే ఎంప్లాయ్ ఒకరికి విచిత్రమైన సమస్య వచ్చింది. అతని కాలి బొటనవేలికి ఇన్ఫెక్షన్ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లగా కాలులో గుండు సూదులు ఉన్నట్లు తేలింది. ఆ తరువాత ఒళ్లంతా పరీక్షించగా గొంతులోనూ పెద్ద సంఖ్యలో సూదులున్నాయి. ఇలా కాళ్లు - చేతులు - గొంతులో మొత్తం 75 గుండుసూదులున్నాయట. అయితే... అవి తన శరీర భాగాల్లోకి ఎలా వచ్చాయన్నది మాత్రం ఆయన చెప్పలేకపోతున్నాడు.
దీంతో ఆయన్ను రాజస్థాన్ నుంచి ముంబయికి వైద్యం కోసం తెచ్చారు. అయితే... ఆయన డయాబెటిక్ పేషెంటు కావడంతో ఇవన్నీ ఆపరేషన్లను చేసి తొలగిస్తే ఏమవుతుందో అని డాక్టర్లు టెన్షన్ పడుతున్నారట.
అదృష్టం ఏమిటంటే ఇన్ని గుండు సూదులు బాడీలోకి వెళ్లినా కూడా లోపలి పార్టులేవీ ఒక్కటి కూడా డామేజి కాలేదట. దీంతో అతని ప్రాణానికి ప్రమాదం ఇప్పటికప్పుడు లేకపోయినా అవి ఒంట్లో ఉండడం వల్ల ఎప్పుడైన ప్రమాదమేనని డాక్టర్లు అంటున్నారు. అలా అని ఆన్ని ఆపరేషన్లు చేయడం కూడా డయాబెటిస్ పేషెంటుకు మంచిది కాదంటున్నారు. చివరకు ఏం చేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/