ఇప్పుడంటా టెక్ యుగం.. హైటెక్ కాలం. పైగా స్టార్టప్ ల సమయం. కొత్తగా నేర్చుకో.. ఇలా చూసి అలా పట్టేయ్.. కుర్ర కారే కాదు.. పిల్ల తరం కూడా అంతే ఉంది. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తో కాదు అన్నట్లు సాగుతోంది కాలం. ఒకటా..? రెండా.? స్టారప్ లలో హిట్ అయినవి ఎన్నో..? స్టారప్ ల ద్వారా కోటీశ్వరులు అయినవారు ఎందరో..? నిండా 25 ఏళ్లు కూడా నిండని యువతను కోటీశ్వరులను చేసింది స్టార్టప్ ల ఆలోచన. దుస్తులు ఉతికేందుకు కొత్త పద్ధతి నుంచి అత్యున్నత టెక్నాలజీ అవసరమైన విషయాల దాకా స్టార్టప్ లు సేవలందిస్తున్నాయి.
కొత్త ఆలోచన వచ్చిందంటే చాలు.. వాటిని కార్యరూపంలో పెట్టే వరకు విద్యార్థులు ముఖ్యంగా ఇంజనీర్లు, మేనేజ్ మెంట్ పట్టభద్రులు నిద్రపోరంటే ఆశ్చర్యం లేదు. ఇలాంటి ఆలోచనలకు ఆర్థిక దన్ను దక్కితే విజయం సాధించి ఎక్కడికో వెళ్లిపోతాయి. ఇప్పుడు మనమంతా చెప్పుకొంటున్న "అమెజాన్" పుట్టింది ఓ కార్ల షెడ్ లో అని ఎందరికి తెలుసు..?ఒక విధంగా చెప్పాలంటే.. ఓ 20 ఏళ్ల కిందటి వరకు కోట్లు సంపాదించాలంటే తరాలు కష్టపడాలి.
ఇప్పుడు మాత్రం ఒక్క కొత్త ఆలోచన చాలు.. ఇదంతా పక్కనపెడితే ఓ తమిళనాడు యువకుడు సొంత యాప్ తో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రసారానికి చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే, ఇది అక్రమం కావడంతో అతడు కటకటాలపాలయ్యాడు.
తమిళనాడు కుర్రాడి అతి తెలివి
సాధారణంగా తమిళనాడు వాళ్లు తెలివిగల వారంటారు. అది నిజమే. వారి క్రియేటివిటీ అమోఘం. అది సినిమాల్లో కానీ, ఇతర కీలక అంశాల్లో కానీ స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే, ఈ కుర్రాడు మాత్రం మరింత ముందుకెళ్లాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ను అవకాశంగా తీసుకుని సొంత యాప్ తో క్రికెట్ మ్యాచ్ ప్రసారానికి పూనుకున్నాుడు. ఎంతైనా క్రేజీ లీగ్ కదా..? దీని ద్వారా రూ.లక్షలు ఆర్జిద్దామని ప్లాన్ వేశాడు. అయితే, అది వికటించింది.
చందా కట్టకుండానే..సెటాప్ బాక్స్ అవసరం లేకుండా
చందా కట్టకుండా, సెటాప్ బాక్స్ అవసరం లేకుండా సొంత యాప్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను ప్రసారం చేస్తున్న తమిళనాడుకు చెందిన రామమూర్తి (29)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిది శివగంగై సమీపం కాంజిరంగల్ లోని పిల్లైయార్ కోయిల్ ప్రాంతం. సాధారణంగా మనం కేబుల్ కనెక్షన్ కు నెలవారీ చందా కడతాం. సెటాప్ బాక్స్ ద్వారా ప్రసారాలు పొందుతాం. ఓటీటీలకైతే నెల, ఆర్నెల్లు, ఏడాది చందా తీసుకుంటాం. కానీ, రామమూర్తి.. చందా కట్టకుండానే, సెటప్ బాక్స్ అవసరం లేకుండానే సొంత యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ ప్రసారానికి పూనుకున్నాడు. అయితే, దీనిని ఐపీఎల్ ప్రసారదారు స్టార్ ఇండియా పసిగట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లింక్ ను దొంగిలించి
గుర్తుతెలియని వ్యక్తులు తమ లింక్ ను దొంగిలించి ఓ యాప్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను ప్రసారం చేస్తున్నారంటూ హైదరాబాద్ బంజారాహిల్స్ కు చెందిన స్టార్ ఇండియా ప్రతినిధి కదరాం తుప్పా.. హైదరాబాద్ సైబర్ క్ర్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. టెక్నాలజీ సాయంతో ఈ యాప్ ను శివగంగై జిల్లా నుంచి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు రోజుల కిందట హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కాంజిరంగల్ వెళ్లి రామమూర్తిని పట్టుకుంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి బుధవానం హైదరాబాద్ తీసుకొచ్చింది.