సాధారణంగా మనం ఆర్డర్ ఇవ్వగానే ఒక్కో ప్లేటులో ఒక్కో ఆహార పదార్థం తీసుకొచ్చి వెయిటర్లు వడ్డిస్తుంటారు. కానీ వీడెవడండి బాబు.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా డజనుకు పైగా ప్లేట్లు మోస్తూ కనిపించాడు. ఒకేసారి సాధారణంగా మూడు , నాలుగు ప్లేట్లు మోయడం చాలా కష్టం. కానీ ఈ వెయిటర్ మాత్రం ఏకంగా డజనుకు పైగా ప్లేట్లు మోసి కస్టమర్లకు చకచకా ఆర్డర్ అందించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన జనాలు ఆ వెయిటర్ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఇతడికి జీతం పెంచాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అతడు మోసింది సాధారణ దూరం కాదు.. హోటల్ కిచెన్ నుంచి గార్డెన్ లోకి కనీసం ఓ 200 మీటర్ల దూరమైనా ఉంటుంది.
అందరూ గార్డెన్ ఏరియాలో తమ బెంచీలపై కూర్చొని ఉన్నారు. అంత దూరం నుంచి వెయిటర్ అన్ని డజన్లకు పైగా ప్లేట్లను మోసుకుంటూ వచ్చాడు. ఇంత ప్రమాదకరంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా కిందా మీద అయితే ప్లేట్లు, ఆహారం నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
అయితే వెయిటర్ మాత్రం బాగా ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి అన్నట్టు కనిపిస్తున్నాడు. ఇతగాడి పనితనం తెలుసు కాబట్టే హోటల్ నిర్వాహకులు ఇలా వదిలేశారని.. అతడి ధైర్య సాహసాలకు మెచ్చుకోవాల్సిందే అంటూ కొనియాడుతున్నారు.
మరి ఈ వెయిటర్ దమ్మూ ధైర్యం చూశాక మిగతా వెయిటర్లు కూడా ట్రై చేస్తారు కావచ్చు. చూడాలి మరీ ఈ వైరల్ వీడియో చూశాక హోటల్స్ లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View