నిజమే... దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ఫిరాయింపులు చెల్లవని తేలిపోయింది. ఇప్పటికే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి షాకిచ్చిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా... తాజాగా ఆప్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి హస్తం పార్టీలోకి చేరిన చాందినీ చౌక్ ఎమ్మెల్యే ఆల్కా లాంబాపై అనర్హత వేటు పడిపోయింది. ఈ మేరకు ఆప్ ఫిర్యాదు ఆధారంగా ఆల్కా ఎమ్మెల్యే గిరీని రద్దు చేస్తున్నట్లుగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ సంచలన ప్రకటన చేశారు.
ఆల్కా లాంబా తొలుత కాంగ్రెస్ పార్టీ నేతగానే రాజకీయ తెరంగేట్రం చేశారు. 2014 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీని వీడిన లాంబా... ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగానే చాందినీ చౌక్ నుంచి పోటీ చేసిన లాంబా... ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఏమైందో తెలియదు గానీ... లాంబా ఆప్ కు షాకిస్తూ లాంబా తిరిగి తన సొంత గూడు కాంగ్రెస్ పార్టీలోకే చేరిపోయారు. అంతేకాకుండా రెండు వారాల క్రితం తాను ఆప్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా లాంబా తన ట్విట్టర్ వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు.
తమ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన లాంబా... తమకు దూరంగా జరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన వైనంపై ఆప్ కాస్తంత గుర్రుగానే ఉంది. అంతేకాకుండా తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరతారంటూ అన్ని రాజకీయ పార్టీల మాదిరే ఆలోచించింది. ఇంకేముంది... వెంటనే తమ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ తో స్పీకర్ కు ఫిర్యాదు చేయించింది. ఆప్ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్.. లాంబా పార్టీ ఫిరాయించారని తేల్చేశారు. అంతేకాకుండా ఆమెపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా కూడా ప్రకటించేశారు. అంటే... పార్టీ మారి ఎమ్మెల్యే గిరిని కైవసం చేసుకున్న లాంబా... ఇప్పుడు మరోమారు పార్టీ మారి ఆ గిరీని కాలదన్నుకున్నారన్నమాట.