ఏ అంటే అంబానీ ఏ అంటే అదానీ.. ఇద్దరూ ప్రపంచ స్థాయి కుబేరులే కావడం విశేషం. ఇంకా చెప్పాలంటే పెద్ద అంబానీగా పిలిచే ముఖేశ్ అంబానీ, అదేవిధంగా మరో కుబేరుడు గౌతమ్ అదానీ ఇద్దరూ ఇవాళ జగన్-కు ఎంతో కావాల్సిన వాళ్లే ! ఏ విధంగా చూసుకున్నా మన రాష్ట్రానికి రిలయెన్స్ సంస్థ కానీ ఇంకా ఇతర గ్రూపులు కానీ చాలా అంటే చాలా దగ్గర.
ఇదే సమయాన అదానీ గ్రూపులు కూడా చాలా అంటే చాలా చోట్ల దగ్గర.. ఉత్తరాంధ్ర కు చెందిన గంగవరం, భావనపాడు సీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను చేజిక్కుంచుకుని, వాటిలో తెలివిగా ప్రభుత్వ వాటాను అంతా కొనుగోలు చేసిన వైనం ఆ రోజుల్లో వార్తల్లో ఆధార సహితంగా వెలుగులోకి వచ్చింది. ఇదే మాట టీడీపీ ఎన్నో సార్లు చెప్పింది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా ఇదే మాట చెప్పింది.
ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అనగా జూన్ లో నలుగురు కీలక వ్యక్తులు ఎంపీ హోదాలో వైసీపీ నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ కోవలో ఆ తోవలో ఒకరు ప్రీతీ అదానీ.. ఇంకొకరు సాయి రెడ్డి అని అంటున్నారు కానీ కుదరదేమో! నలుగురిలో ఒక బీసీ మహిళ అనుకున్నా అది కూడా కానిచ్చేలా లేరు.
ఆ విధంగా కృపారాణికి నిరాశే తప్పదు. మైనార్టీ వర్గానికి కూడా ఓ ఛాన్స్ ఉంటుంది. ఉంటే ఉంటుంది లేదంటే లేదు. విడదల రజనీ కోసం సీటు త్యాగం చేసిన ఓ కీలక కమ్మ లీడర్ కు కూడా ఛాన్స్ ఉంటే ఉంటుంది లేదంటే లేదు.
ఏదేమయినప్పటికీ అంబానీలు, అదానీలపై అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చేయి.అదంతా ఉమ్మడి ఆంధ్రాలో తరువాత చంద్రబాబు నాయుడు మాత్రమే కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఉంటారని కమ్యూనిస్టులు నానా యాగీ చేశారు.
కానీ ఇప్పుడు మాత్రం పరిమళ్ నత్వానీ, ప్రీతీ అదానీ వంటి పేర్లు వినిపిస్తుండడంతో గుజరాతీ పెద్దలకు జగన్ బాగానే చేరువగా ఉన్నారు. కనుక మోడీ హిందీ టీం జగన్ కు చేరువగానే ఉన్నారు అన్నది నిర్థారణ.మరి ! మోడీ తెలుగు టీం ఎందుకు వ్యతిరేకిస్తుందని? అంటే అదంతా ఓ పెద్ద రహస్యం.. అంతు పోలని రహస్యం అని రాయాలి.