ఉత్తరప్రదేశ్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు షౌకత్ అలీ హిందువులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. ముగ్గురు భార్యలను సమానంగా గౌరవిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. హిందువులు మాత్రం ఒకే పెళ్లి చేసుకుని, ముగ్గురు మిస్ట్రెస్‌లను కలిగి ఉంటారని హాట్ కామెంట్స్ చేశారు. హిందువులు అటు భార్యను కానీ, ఇటు మిస్ట్రెస్‌లను కానీ గౌరవించరని కాక రేపే వ్యాఖ్యలతో కలకలం రేపారు.
ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు షౌకత్ అలీ ఓ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో హిందువుల వివాహ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. ముస్లింలు ఎంత మందిని పెళ్లి చేసుకున్నా, ఆ భార్యలందరినీ సమానంగా గౌరవిస్తారని వెల్లడించారు.
మేము మూడు పెళ్లిళ్లు చేసుకుంటామని అంటూ ఉంటారు. మేం రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ, ఆ ఇద్దరికీ సమాజంలో గౌరవం ఇస్తాం. కానీ మీరు (హిందువులు) ఒకరిని పెళ్లి చేసుకుంటారు, ముగ్గురు మిస్ట్రెస్‌ను కలిగి ఉంటారు. మీరు మీ భార్యను గౌరవించరు, ఆ మిస్ట్రెస్‌లను కూడా గౌరవించరు. మేం రెండు పెళ్లిళ్లు చేసుకున్నా, వారిని గౌరవిస్తాం. మా పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డుల్లో ఉంటాయి'' అని షౌకత్ అలీ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అలాగే షౌకలీ అలీ హిజాబ్ వస్త్రధారణపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తరగతి గదుల్లో హిజాబ్ ధారణపై నిషేధం విధించడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలో ఎవరు ఏం ధరించాలో హిందుత్వ నిర్ణయించదని తేల్చిచెప్పారు. అది రాజ్యాంగం నిర్ణయిస్తుందన్నారు. ఇలాంటి అంశాలను లేవనెత్తుతూ దేశాన్ని ముక్కలు చేయడానికి బీజేపీ పనిచేస్తోందని నిప్పులు చెరిగారు.
బీజేపీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని షౌకత్ అలీ ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజేపీ నేతలు... మదరసాలు, మూక దాడులు, వక్ఫ్, హిజాబ్ వంటి సమస్యలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు. బీజేపీ బలహీనపడినప్పుడల్లా ముస్లిం సమస్యలను లేవనెత్తుతుందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో షౌకత్ ఆలీ హిందువులపై చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, హిందుత్వ కార్యకర్తలు ఆయనపై మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.