సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఓవైసీ బ్రదర్స్. రెచ్చగొట్టే తీరుతో మాట్లాడటం.. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తారన్న ఆరోపణలకు తగ్గట్లే వ్యాఖ్యలు ఉండటాన్ని పలువురు తప్పు పడుతుంటారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యను ప్రస్తావిస్తూ తాజాగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్య మరింత సంచలనంగా మారింది.
కరీంనగర్ లో మజ్లిస్ వ్యవస్థాపకుడు అబ్దుల్ వాహెద్ ఒవైసీ సంస్మరణ సభకు ముఖ్య అతిధిగా హాజరైన అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క పావుగంట వదిలిపెట్టండి.. హిందూ ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తామంటూ 2013లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని తాజాగా మరోసారి గుర్తు చేశారు. ఆ రోజు తాను అలా అన్నందుకే ముస్లిం ప్రజల్లో ధైర్యం పెరిగిందన్నారు.
ఆరెస్సెస్ మనల్ని ముట్టుకోవటానికి కూడా సాహసించదు. ఎందుకంటే నేను ఆ రోజు చేసిన వ్యాఖ్యలకు అదిప్పటికి భయపడుతోందన్నారు. మనం భయపెడితే ఎదుటివారు భయపడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ ఓడినా ఫర్లేదు.. బీజేపీ మాత్రం గెలవకూడదన్నారు. గతంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ గా ముస్లిం ఉండేవారు. ఇప్పుడు బీజేపీ వ్యక్తి ఉన్నారన్నారు. మజ్లిస్ కు ఓటు వేయనందుకు బాధ లేదని.. కానీ బీజేపీ గెలిస్తే సహంచబోమన్నారు.
ముస్లింలంతా ఒక్కతాటిపై నిలబడి ముందుకు సాగితేనే మన లక్ష్యాన్ని సాధించగలమన్న ఆయన ఎంతమంది గాడ్సేలు వచ్చినా మనల్నిఏమీ చేయలేరన్నారు. తానెప్పుడు చనిపోతానో తెలీదని వైద్యులు చెప్పారని.. ఎప్పుడైనా చనిపోవచ్చని.. ఒక్క అక్బరుద్దీన్ ఓవైసీ చనిపోతే వెయ్యిమంది అక్బరుద్దీన్ లు పుట్టుకొస్తారని.. తాను టైగర్ ను కాదన్నారు. యువతను టైగర్లుగా మార్చాలనుకుంటున్నానని.. అదే తన లక్ష్యమన్నారు.
నిజమైన సెక్యులరిజం ముస్లింలదేనని.. ముస్లింలపై రజాకార్ల ముద్ర వేయొద్దన్నారు. మజ్లిస్ ను మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారని.. అలా చేసే వారు ఎవరో కాదని.. గాడ్సేను పొగిడినవాళ్లేనన్నారు. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే తనకు ఇష్టమన్న అక్బరుద్దీన్.. మూకదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మరింతగా మంట పుట్టించటమే కాదు.. కొత్త ఉద్రిక్తతలకు తెర తీసే అవకాశం ఉందన్న మాట వ్యక్తమవుతోంది.