ఆమె చెప్పిన 3 నిమిషాల మాటలకు టికెట్ ఇచ్చేసిన అఖిలేశ్

Update: 2022-01-27 04:08 GMT
ఇప్పుడంతా ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద అందరి చూపు ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని సర్వేలు చెబుతున్నా.. అందుకు భిన్నమైన రిజల్ట్ వస్తుందన్న మాట రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. సర్వేలు వెల్లడించినట్లుగా బీజేపీకి భారీగా సీట్లు వచ్చే అవకాశం లేదని చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. బీజేపీని ఎన్నికల్లో దెబ్బేసి.. తర్వాతి అధికారపక్షంగా సమాజ్ వాదీ పార్టీ మారుతుందన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. టికెట్ కేటాయింపుల విషయంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.

అయితే.. తన తీరుకు భిన్నంగా ఒక మహిళకు మాత్రం కేవలం ఆమె చెప్పిన మూడు నిమిషాల మాటలకు కన్వీన్స్ అయి.. అప్పటికే వేరు అభ్యర్థికి ఇవ్వాల్సిన టికెట్ ను ఆమెకు ఇచ్చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ అధినేతను అంత స్వల్ప వ్యవధిలో ఏం చెప్పి రూపాలీ దీక్షిత్ టికెట్ ను కన్ఫర్మ్ చేసుకున్నారన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే.. అసలు విషయాన్ని చెప్పేసింది.

లా డిగ్రీ చేసి.. యూకేలోని వర్సిటీలో రెండు పీజీలు చేసిన ఆమె.. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇంతకూ ఆమె చెప్పిన ఏ మాటలకు అఖిలేశ్ కన్వీన్స్ అయ్యారన్నది చూస్తే.. ‘ప్రత్యర్థులు జైల్లో ఉన్న నా తండ్రిని అవమానించారు.

ఠాకూర్ కమ్యూనిటీని కించపరిచారు. అందుకు వారికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంటున్నా. నేను కులతత్త్వాన్ని విశ్వసించను. అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వ పథకాల్లో పారదర్శక కేటాయింపుల్నికోరుకుంటున్నా. నాకు అవకాశం ఇస్తే.. తప్పకుండా గెలిచి వస్తా’ అని తాను చెప్పానని.. అందుకు కన్వీన్స్ అయి తనకు టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. రూపాలీ ధీమాకు ముచ్చట పడే అఖిలేశ్ ఆమెకు టికెట్ ఇచ్చి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయిన మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News