ఆయన అమిత్ షా వదిలిన బాణం

Update: 2018-02-09 17:06 GMT
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మిత్రపక్షం తెలుగుదేశం పార్టీపై మరోసారి మండిపడ్డారు. తనను ఎదుర్కోలేకపోతున్న టీడీపీ త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబును తాను ప్రశ్నించినందుకు తమ పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా తనకు క్లాస్ పీకారంటూ మీడియాలో ప్రచారమవుతోందని.. అదంతా తప్పుడు ప్రచారమని, అందులో కొంచెం కూడా వాస్తవం లేదని ఆయన అన్నారు. అలాగే తాను వైసీపీ కోవ‌ర్డున‌ంటూ చేస్తున్న దుష్ప్రచారం కూడా తప్పన్నారు.
    
అమిత్ షా తనకు ఫోన్ చేసి మందలించారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోందని.. అది నిజమని నమ్మేవారు ఎవరైనా ఉంటే వచ్చిన తన కాల్ డేటా చూసుకోవచ్చని చెప్పారు. తన గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. తనను వైసీపీ కోవర్టు అంటూ చేస్తున్న ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందని చెప్పారు. ఏపీలో మైలేజీ కోసమే టీడీపీ - వైసీపీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని… దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు.
    
మరోవైపు ఏపీలో తాజా రాజకీయ పరిణామం జేఏసీ ఏర్పాటును ఆయన మంచి పరిణామంగా అభివర్ణించారు. ప‌వ‌న్ జేపీ, ఉండ‌వ‌ల్లితో జేఏసీ ఏర్పాటు మంచిదేన‌న్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తుంది.. రాష్ట్రం ఏం చెబుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్రం నిజంగా ఏపీకి అన్యాయం చేస్తే పెద్ద‌లు ఢిల్లీకి వెళ్లి మాట్లాడాల‌న్నారు. రాష్ట్రంలో ఆందోళ‌న‌కు ఫుల్‌స్టాఫ్ పెట్టాల‌న్నారు. మొత్తానికి సోము వీర్రాజు తీరు చూస్తున్నా.. కేంద్రం తీరు చూస్తున్నా ఆయన్ను అమిత్ షా మందలించారనడానికి ఏమాత్రం ఆధారం కనపడడం లేదు. అంతేకాదు... ఆయన అమిత్ షా వదిలిన బాణమని అనేవారూ ఉన్నారు.

Tags:    

Similar News