ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోవచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన జగన్!

Update: 2021-10-08 05:30 GMT
ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొందరు ఉద్యోగుల్ని ఏపీకి సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వారంతా తెలంగాణలో స్థిరపడిపోవటంతో వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చేస్తున్న ఉద్యోగాల్ని మార్చేసుకున్నంత తేలిగ్గా.. ప్రభుత్వ ఉద్యోగానికి అస్సలు ఊరుకోరు. దీంతో.. పలువురు తెలంగాణలో ఫ్యామిలీలను పెట్టేసి.. ఏపీలో పని చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏపీ నుంచి తెలంగాణకు పంపేందుకు వీలుగా సీఎం జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

తెలంగాణకు రిలీవ్ చేసే ప్రక్రియపైన ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. తెలంగాణ స్థానికతతో పాటు భార్యలు ఆ రాష్ట్రంలో పని చేస్తున్న వారికి ఈ వెసులుబాటు కల్పించాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్.

తెలంగాణ రాష్ట్రానికి బదిలీపైకి వెళ్లాలని భావిస్తున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్ సేకరించాలని.. అందుకు అవసరమైన మార్గదర్శకాల్ని సిద్ధం చేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం ఏపీ వ్యాప్తంగా వివిధ దశల్లో తెలంగాణలో కుటుంబాలు ఉంటూ ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు 2 వేల మంది వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయిన వారు ఏపీలో పని చేస్తున్న కారణంగా వారికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించగా.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. తాజా ఆదేశాల్ని జారీ చేశారు.


Tags:    

Similar News