హాట్ హాట్ గా సాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ప్రభావాన్నిచూపించే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డేకు చెందిన కాన్వాయ్ కు మంగళవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు యాక్సిడెంట్ నుంచి కేంద్రమంత్రి అనంతకుమార్ తృటిలో తప్పించుకున్నారు.
కర్ణాటకలోని హవేరీ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి తాజాగా జరిగింది ప్రమాదం కాదని.. తనపై జరిగిన హత్యాయత్నంగా ఆయన అభివర్ణించటం గమనార్హం. తనను ఎవరో చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. పోలీసులు ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
జరిగిన ప్రమాదాన్ని పరిశీలిస్తే.. ఇది కచ్ఛితంగా రోడ్డు ప్రమాదంగా అనిపించదని.. హత్యాయత్నంగా అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వేగంగా వచ్చిన ఒక ట్రక్లు తన కారును ఢీ కొట్టే ప్రయత్నం చేసిందన్నారు. ట్రక్కును నడుపుతున్న డ్రైవర్ ఫోటోను తన ట్విట్టర్ లో ఉంచిన ఆయన.. సదరు డ్రైవర్ సమాచారాన్ని.. అతడి వెనుక ఉన్న వారు ఎవరో తెలుసుకోవాల్సి ఉందని పోలీసుల్ని కోరారు. ఇంతకీ కేంద్రమంత్రి అనంతకుమార్ కు ఎదురైంది రోడ్డు ప్రమాదమా? హత్యాయత్నమా?