ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి విషంయలో ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడుతూ మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎవరైతే అన్యాయం చేశారో వారు సిగ్గుపడేలా రాష్ట్ర రాజధాని అభివృద్ది చేస్తానని అన్నారు. కష్టం మనకు శాశ్వతం కాదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ``విభజనలో అన్యాయం జరిగింది. అలా అని ఇంట్లో పడుకుంటే ఎలా?, కష్టపడటమే నేర్చుకున్నాం...చేసుకుంటూ పోతే అద్భుతాలు సృష్టించగలం. కష్టపడి పనిచేయడమే నిజమైన దేశభక్తి, సేవ. మాటలు చెప్పడం కాదు` అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రతిపక్షం మాటలు చెప్పినంత సులువుగా పనులు కావని, అందుకు పట్టుదల ఉండాలని అన్నారు.
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించడం సరైందేనా అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.మనకు జరిగిన నష్టం ఎంతో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. జూన్ 3న మూడేళ్ల ప్రగతి, 4న వ్యవసాయ అనుబంధ రంగాలపై, 5న సంక్షేమం, 6న మానవ వనరుల అభివృద్దిపై అందరూ చర్చించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈనెల 8వతేదీన ప్రతి ఒక్కరూ పునరంకిత దీక్ష తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. నష్టం పూడ్చుకునేందుకు ఏం చేయాలో మనం సమీక్షించుకోవాలన్నారు. ఆదాయం వచ్చే మార్గాలను నిరంతరం అన్వేషిస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలంటే రూ.5లక్షల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. అలాంటి నిర్మాణానికి 20ఏళ్ల సమయం పడుతుందన్నారు. పరిపాలనలో మూడేళ్లు పూర్తి చేసుకున్నామని, ఏం సాధించామో సమీక్షించుకుంటామని చంద్రబాబునాయుడు అన్నారు. గతేడాది వందశాతం విద్యుత్ లక్ష్యాన్ని సాధించామన్నారు. గత ఏడాది విద్యుత్ సమస్యను పరిష్కరించామని, ఈ ఏడాది ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యమని చంద్రబాబునాయుడు అన్నారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో చివరిస్థానంలో ఉన్నామని, ఇబ్బందులను అధిగమించి తలసరి ఆదాయంలో మొదటి స్థానం పొందాలని చంద్రబాబునాయుడు అన్నారు.
కాగా, ఏపీ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్, ఇన్‌పుట్ సబ్సిడీ, స్కూళ్ల రేషనలైజేషన్‌పై కేబినెట్‌లో చర్చించారని సమాచారం. విజయవాడ మెట్రోకు రుణ పరిమితి పెంపు, రూ.2,175 కోట్ల వరకు హడ్కో రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో 2500 ఎకరాల్లో బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్, సెజ్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. రేషన్ షాపుల్లో చక్కెర తొలగింపు, షాపుల మనుగడపై చర్చించారు. రేషన్ షాపుల మనుగడకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి సంఘాలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలని, చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన విద్యార్థులకు సీఎం చంద్రబాబునాయుడు నజరానా ప్రకటించారు. అధిరోహించిన ఒక్కో విద్యార్థికి రూ.10లక్షలు, ఎవరెస్ట్ వరకూ వెళ్లి విఫలమైన వారికి రూ.5లక్షల చొప్పున నజరానా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే కోచ్ శేఖర్‌బాబుకు రూ.10లక్షల నజరానా ప్రకటించారు.