తెలంగాణ‌తో పాటు కేంద్రాన్ని ఇరికిస్తోన్న ఏపీ... కొత్త వాద‌న‌..!

Update: 2021-10-07 10:33 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదంగా మారిన పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్టు ప‌నులు నిలిపివేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లో బ‌లంగా త‌న వాదాన‌లు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుపై కేంద్రం త‌న వైఖ‌రి ఏంటో చెప్పాలంటూ ఏపీ స‌రికొత్త మెలిక పెడుతోంది. తెలంగాణ స‌ర్కార్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పాల‌ర‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్టును అక్ర‌మంగా నిర్మిస్తోంద‌ని... దీనివ‌ల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప‌ర్యావ‌ర‌ణానికి హానీ కలుగుతుంద‌ని కూడా పేర్కొంది. ఏపీ ప్ర‌భుత్వం ఇదే విష‌యాన్ని నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్లో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ మ‌రీ త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించింది.

ఏపీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీరామ్ ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌న‌ల‌ను జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ చెన్నై ధ‌ర్మాస‌నం ముందు వాద‌న‌లు వినిపించాయి. తెలంగాణ ప్ర‌భుత్వం సాగునీటి కోసం ఈ ప్రాజెక్టును చేప‌ట్టి.. పైకి మాత్రం తాగునీటి ప్రాజెక్టు పేరుతో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కూడా తీసుకోలేద‌ని ఆరోపించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన నేప‌థ్యంలో కేంద్రం త‌న వైఖ‌రి ఏంటో వెంట‌నే చెప్పాల‌ని శ్రీరామ్ ప్ర‌శ్నించారు.

దీనిపై కేంద్రం త‌ర‌పున న్యాయ‌వాది కూడా స్పందించారు. ఈ ప్రాజెక్టుపై జ‌రుగుతోన్న విచార‌ణ ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంద‌ని.. తుది విచార‌ణ త‌ర్వాత కేంద్రం వైఖ‌రి ఏంట‌న్న‌ది త‌ప్ప‌కుండా చెపుతామ‌ని ధ‌ర్మ‌స‌నానికి చెప్పారు. దీనిపై తెలంగాణ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ రామ‌చంద్ర‌రావు ప్ర‌తివాద‌న వినిపించారు. గ్రీన్ ట్రిబ్యున‌ల్లో పిటిష‌న్ దాఖ‌లుకు ఆరు నెల‌ల టైం ఉంటుంద‌ని.. ఆ స‌మ‌యం మించి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను విచారించ కూడ‌ద‌ని చెప్పారు.

ఏపీ ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్ విచార‌ణ‌కు అర్హ‌మైంద‌ని శ్రీరామ్ వాదిస్తే... రైతుల పిటిష‌న్ ప్ర‌వేశ స‌మ‌యంలోనే దీనిని విచార‌ణ‌కు నిరాక‌రించార‌ని రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్ర‌కారం తాము కేవ‌లం తాగునీటి ప్రాజెక్టు కోస‌మే నిర్మాణం చేప‌ట్టామ‌ని.. అయితే త‌ర్వాత సాగునీటి కోసం ప్రాజెక్టు కోసం అనుమ‌తి కోరిన‌ట్టు చెప్పారు. దీనిపై అనుమ‌తులు వ‌చ్చేవ‌ర‌కు తాము సాగునీటి ప్రాజెక్టును నిర్మాణం చేప‌ట్ట‌మ‌ని కూడా రామ‌చంద‌ర్ రావు చెప్పారు.

ఇక ఒక్క టీఎంసీ నీరు 5 ల‌క్ష‌ల మందికి స‌రిపోతుంద‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వం 67 టీంఎసీల నీరు కావాల‌ని అడుగుతోంద‌ని.. భారీ స్థాయిలో రిజ‌ర్వాయ‌ర్లు చేప‌ట్టి కృష్ణా జ‌లాల‌ను మ‌ళ్లిస్తే.. దిగువున ఉన్న ఏపీకి నీరు ఎలా అందుతుంద‌ని కూడా ఏపీ ప్ర‌భుత్వం బ‌ల‌మైన వాద‌న వినిపించింది. తెలంగాణ నిర్మిస్తోన్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కేంద్రం వైఖ‌రి చెప్ప‌కుండా ఆదేశాలు ఇవ్వ‌వొద్ద‌ని ధ‌ర్మ‌స‌నానికి విజ్ఞ‌ప్తి చేసిన ఏపీ అటు తెలంగాణ‌తో పాటు ఇటు కేంద్రాన్ని కూడా ఈ ఇష్యూలోకి లాగింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.





Tags:    

Similar News