తొలి విడత బడ్జెట్ సమావేశాల చివరి రోజు కూడా పార్లమెంటు దద్దరిల్లింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. లోక్‌సభలో క్వశ్చన్ అవర్ ప్రారంభమైన వెంటనే ఆంధ్రా ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ఇటీవలి బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులేమీ లేవంటూ... ఎన్డీయే మిత్రపక్షం సహా.. అన్ని ఇతర పార్టీలు కూడా 3 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రంలోని పెద్దలు మాత్రం వాటికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. దీంతో ఎంపీలు ఆందోళన చేశారు. సభా కార్యక్రమాలకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహజన్ విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సేమ్ సీన్ రిపీటైంది. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ లోక్ సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు.
పార్లమెంట్లో ఒత్తిడి పెంచితే ఫలితం ఉంటుందేమోనన్న ఆశాభావంతో టీడీపీ ఎంపీలతో పాటు.. విపక్ష కాంగ్రెస్ - వైసీపీ ఎంపీలు కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్లమెంట్ బయట కూడా ప్లకార్డులతో నిరసనలు తెలిపి హోరెత్తించారు. కేంద్రం నుంచి నిర్దిష్ట ప్రకటన సాధించే ఉద్దేశంతో టీడీపీ ఎంపీలు - మంత్రి సుజనాచౌదరి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో కొత్త ప్రకటన చేస్తానన్న హామీ లభించింది. దీంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే కార్యక్రమానికి ఏపీ ఎంపీలు సహకరించారు. అయితే జైట్లీ అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. సాయంత్రం సభ ముగిసేదాకా బడ్జెట్లోని అంశాలపైనే జైట్లీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జీఎస్టీ - డీమోనిటైజేషన్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ పాత పద్ధతిలోనే కాంగ్రెస్ మీద అటాక్ చేశారు. రాష్ట్ర విభజనకు మద్దతిచ్చినా ఏపీ హక్కుల కోసం చిత్తశుద్ధితో పోరాడామని, ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయన్నారు జైట్లీ. రాష్ట్రానికి పలు జాతీయ సంస్థలు కేటాయించామని, వాటికి నిధులు ఇస్తున్నామని, ఇంకా ఇస్తామనీ.. ఇలా పొడిపొడి మాటలే మరోసారి సభాముఖంగా వల్లించారు. అదనపు నిధుల గురించి గానీ, విద్యాసంస్థలు, పోలవరం, రాజధానిపై కచ్చితమైన హామీ గానీ జైట్లీ నోట రాలేదు.
రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగింది. జీరో అవర్ ప్రారంభానికి ముందే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని శూర్పణకతో పోల్చుతూ కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె రాజ్యసభలో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. కిరెర్ రిజిజు చర్య మహిళలను అవమానించడమే కాక తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆమె మండిపడ్డారు.
మరోవైపు, సభ్యుల ఆందోళన కొనసాగుతుండటంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ సభ్యుల నిరసన నేపథ్యంలో సభ గందరగోళంగా మారింది. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం రెండున్నర వరకు వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రైవేట్ బిల్లుకు బదులు బడ్జెట్ పై చర్చకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడంతో సభ సజావుగా సాగింది. పలువురు ఎంపీలు బడ్జెట్ లో జరిగిన కేటాయింపులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. గురువారం కాంగ్రెస్ ఎంపీ చిదంబరం లేవనెత్తిన సమస్యలను ప్రస్తావించిన ఆర్థికమంత్రి - యూపీఏ ప్రభుత్వం పనితీరు కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. జైట్లీ సమాధానం అనంతరం ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు. దీంతో తొలి విడత బడ్జెట్ సెషన్ ముగిసింది.