ముమ్మారు తలాక్ లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. బీజేపీ సభ్యులు సమరోత్సాహంతో తలాక్ బిల్లును ఆమోదించే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్ పాక్షిక మౌనంగా ఉంటూనే.. మార్పుల మీద సన్నాయి నొక్కులు నొక్కింది. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ తలాక్ బిల్లుపై తమ వ్యతిరేకత వ్యక్తం చేయగా.. మజ్లిస్ అధినేత అసుద్దీన్ ఓవైసీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆయన ఈ బిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. ఆయన లేవనెత్తిన సవరణలకు సభ్యుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. అదే సమయంలో.. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మోడీ వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. అసద్ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. నిజానికి అసద్ వాదనలో పస లేదని చెప్పాలి.
ఆ కారణంగా.. చిన్న చిన్న అంశాల్ని సాకుగా చూపిస్తూ ముమ్మారు తలాక్ చెప్పేసి.. వివాహ బంధానికి తెగ తెంపులు చెప్పే వారికి ముకుతాడు వేసేందుకు ఉద్దేశించిన బిల్లును.. అర్థం లేని వాదనల్ని తీసుకొచ్చి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని అసద్ చేశారని చెప్పాలి.
తలాక్ బిల్లుపై మాట్లాడిన సందర్భంలో అసద్ మాట్లాడుతూ.. ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వం హరిస్తోందని వ్యాఖ్యానించారు. తలాక్ చెప్పటం ప్రాథమిక హక్కు అయితే.. తన భర్తతో వైవాహిక సంబంధాన్ని తలాక్ ద్వారా కోల్పోవటం.. సదరు ముస్లిం మహిళ ప్రాథమిక హక్కును కోల్పోవటం కాదా? అన్న పాయింట్ ను అసద్ పట్టించుకోకపోవటం గమనార్హం.
అసద్ మాటలు పురషాధిక్యాన్ని కొనసాగించేలా ఉండటం.. ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పెద్ద ఆసక్తి లేనట్లుగా ఉందని చెప్పాలి. తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ వ్యక్తిగత అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. గుజరాత్ లోని మన బాబీ (వదిన) సహా వివిధ మతాలకు చెందిన 20 లక్షల మంది తమ భర్తల నుంచి దూరంగా ఉన్నారన్నారు. వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవాలంటూ మోడీకి చురక అంటించే ప్రయత్నం చేశారు.మోడీ తన భార్యతో దూరంగా ఉండటాన్ని అసద్ ప్రస్తావించారని చెప్పాలి.
చిన్నతనంలో జరిగిన పెళ్లి.. ఆ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ దూరంగా ఉండటాన్ని.. నిద్ర ఆలస్యంగా లేచిందని.. రెండో పెళ్లి చేసుకోవటానికి మొదటి భార్యను వదలించుకోవటానికి.. తనకు ఇష్టం లేని పనులు చేస్తుందన్న సాకుతో ముమ్మారు తలాక్ చెప్పటానికి.. మోడీ లాంటి ప్రత్యేక ఇష్యూల్ని ఒకే గాటున కట్టటం చూస్తే.. అసద్ తొండి మాటలు ఏ రీతిలో సాగాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
పార్లమెంటు లోపలే కాదు బయట కూడా అసద్ తన వ్యతిరేకతను బాహాటంగానే ప్రదర్శించారు. సివిల్ వ్యవహారమైన పెళ్లిపై క్రిమినల్ కేసులు పెట్టటం సరికాదన్న ఆయన.. తలాక్ ను ముస్లిం దేశాలూ వ్యతిరేకిస్తున్నాయి కదా అనే ప్రశ్నకు బదులిస్తూ.. అన్ని దేశాల్లోని అన్ని చట్టాలనూ భారతదేశంలోనూ అమలు చేయొచ్చు కదా అని తిరిగి ప్రశ్నించారు.
నిజానికి అసద్ కోరుకున్నట్లే.. అన్ని దేశాల్లో అమలు చేసే చట్టాల్ని భారతదేశంలో అమలు చేయటంలో తొలి అడుగ్గా ముమ్మార్ తలాక్ ను నేరంగా చట్టం చేశారని అసద్ అనుకోవచ్చుగా. అన్ని ఒకేసారి ఎక్కడా మొదలు కావు కదా? కోట్లాది మంది ముస్లిం మహిళలకు మేలు చేసే ఒక అంశాన్ని అసద్ సానుకూలంగా ఎందుకు రియాక్ట్ కారన్నది ఒక ప్రశ్న అయితే.. ముమ్మార్ తలాక్ బిల్లును లోక్ సభలో ఆమోదించాక చాలా ప్రాంతాల్లోని ముస్లిం మహిళలు స్వీట్లు పంచుకోవటం లాంటి దృశ్యాల్ని అసద్ చూస్తే బాగుండు. ఒకవేళ.. అలాంటివి చూసేందుకు అసద్ ఇష్టం లేని పక్షంలో రానున్న రోజుల్లో సొంత మనుషుల నుంచే వ్యతిరేకత వ్యక్తం కావటం ఖాయం. ఆ విషయాన్ని అసద్ గుర్తిస్తే మంచిది.