పాకిస్తాన్ ఓటమిపై రమీజ్ రాజా అసహనం.. భారత జర్నలిస్ట్ పై ఫైర్

Update: 2022-09-12 14:30 GMT
ఆసియాకప్ 2022లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ టీం ఫైనల్లో ఊహించని విధంగా శ్రీలంక చేతిలో ఓడిపోయింది.  దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు ఆఖర్లో లయ తప్పారు. అనంతరం బ్యాటింగ్ లోనూ ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు.

దాంతో 23 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక.. ఆరోసారి ఆసియాకప్ ను ముద్దాడింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు దుబాయ్ స్టేడియానికి వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా  తట్టుకోలేకపోయారు.

 పాక్ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతుండగా.. అతడికి భారతీయ జర్నలిస్ట్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ‘పాకిస్తాన్ ప్రజలు చాలా బాధపడుతూ ఉంటారు.. ఇప్పుడు మీరు వారికి ఏం సందేశం ఇస్తారు’ అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.  దానికి రమీజ్ రాజా అసహనం వ్యక్తం చేశాడు. ‘నువ్వు భారత్ నుంచి వచ్చావా? ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నట్టుంది. మేం ఓడితే భారతీయులే సంతోషంగా ఉంటారు’ అంటూ అతడి ఫోన్ ను లాక్కొని మళ్లీ అతడికే ఇచ్చి వెళ్లిపోయాడు.

రమీజ్ రాజా పాకిస్తాన్ ఓడినందుకు బాధపడలేదు.. ఇండియన్స్ సంతోషంగా ఉన్నందుకే అతడికి మండిందని సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్తాన్ జట్టును గాడిలో పెట్టాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై దురుసుగా వ్యవహరిస్తారా? అని సెటైర్లు వేస్తున్నారు.

ఆసియా కప్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. శ్రీలంకను ఓటమి దగ్గరికి తీసుకొచ్చి మరీ గెలిపించలేకపోయింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ ను భారత్ ఓడించగా.. సూపర్ 4లో టీమిండియాను పాక్ ఓడించింది. అయితే శ్రీలంక చేతిలో కూడా ఓడిపోయిన భారత్ సూపర్ 4 దశలోనే ఇంటి బాట పట్టింది. కానీ ఫైనల్ కు చేరిన పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో మూడోసారి ఆసియా కప్ ను గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    

Similar News