`వారి..` త‌ప్పుల‌కు.. జ‌గ‌న్ ప‌రువు పోతోందా...?

Update: 2021-09-30 15:30 GMT
ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్నివైపుల నుంచి ఇరుకున ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌వైపు విప క్షం, మ‌రోవైపు.. కోర్టుల తీర్పులు, ఇంకో వైపు ఓ వ‌ర్గం మీడియా దూకుడు ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇ బ్బందికర ప‌రిణామాలు మామూలుగా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. పాల‌న‌ను ముందుకు తీసుకువెళ్ల‌డం.. కోసం చేస్తున్న అప్పులు.. పార్టీలో ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం.. ఇలా అనేక ప‌రిణామాలు.. జ‌గ‌న్ ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి.

అయితే.. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. జ‌గ‌న్ ప్ర‌మేయం లేని.. సీఎంకు అస‌లు సంబంధం కూడా లేని.. విష యాల్లోనూ ఆయ‌న విల‌న్‌గా మారుతుండ‌డం గ‌మ‌నార్హం. అదేంటి? అంటున్నారా? ఇక్క‌డే ఉంది విష యం. కొంద‌రు అధికారులు చేస్తున్న త‌ప్పులు.. జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా ఇంత‌లింత‌లు చేసి చూపిస్తూ.. జ‌గ‌న్‌ను ప‌రువును పోగొట్టేస్తోంది. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాలు.. జ‌గ‌న్‌ను దోషిగా చిత్రీక‌రించిన తీరునుచూస్తే.. ఆయ‌న ప్ర‌మేయం ఎక్క‌డా క‌నిపించ‌దు. కేవ‌లం.. అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన తీరు.. వారి ఉదాసీన‌త కార‌ణంగా.. సీఎం చుట్టూ విమ‌ర్శ‌లు రేగాయి.

తాజాగా కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుని.. ప్ర‌భుత్వం ఏదో అక్ర‌మాలు చేస్తోంద‌నే ధోర‌ణి వ్య‌క్తమైం ది. సీఎం జ‌గ‌న్ తీసుకున్న స‌మ‌గ్ర స‌ర్వేలో భాగంగా.. విధి విధానాలు రూపొందించేందుకు రెవెన్యూ అధికారులు.. స‌మాయ‌త్త‌మ‌య్యారు. అయితే.. ఈ క్ర‌మంలో ఇత‌ర రాష్ట్రాల్లో దీనికి సంబంధించి.. ఏం చేస్తున్నార‌నే విష‌యాన్ని ప‌రిశీలించారు. ఇంత వ‌ర‌కుఎవ‌రైనా చేసేదే. అయితే.. ఇక్క‌డే అధికారుల నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఎక్క‌డో ఉన్న ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో అమ‌లైన విధానాన్ని తీసుకున్నారు.

కానీ, అక్క‌డి విధాన్నాన్ని పూర్తిగా కాపీ కొట్ట‌డం.. క‌నీసం ఏపీ ప్లేస్‌లో ఉత్త‌రాఖండ్ అని ఉన్న‌దాన్ని చూడ కుండానే ఆమోదించ‌డం.. దీనినే జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్‌కు పంపించ‌డం.. వంటివి వివాదానికి దారితీ శాయి. అయితే.. దీనిని చూపించి... జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా మాత్రం.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిం చింది. ఏదో జ‌రిగిపోతోంద‌ని.. ప్ర‌భుత్వం గుట్టు ఇలా బ‌య‌ట‌ప‌డింద‌ని.. వ్యాఖ్య‌లు చేసింది. వాస్త‌వానికి దీనిలో అధికారుల త‌ప్పు త‌ప్ప‌.. సీఎం జ‌గ‌న్‌కి ప్ర‌మేయం ఏమీలేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ను ఏకిపారేయ‌డం గ‌మ‌నార్హం.




Tags:    

Similar News