గట్టిగా నెల రోజులే అయింది వైసీపీ కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించి. ఇక కొత్త మంత్రులలో సీనియర్ మోస్ట్ లీడర్ అంబటి. ఆయన ఎపుడో 1989లో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ తరఫున నాడు గెలిచారు. ఆ రోజుల్లో వైసీపీలో ఇపుడు సీఎం జగన్ సహా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ కూడా రాజకీయాల గురించే అసలు ఆలోచించి ఉండరు.
చిత్రమేంటి అంటే అదే అంబటి ఎన్నో సార్లు కాంగ్రెస్ టికెట్ సాధించినా ఎమ్మెల్యేగా మాత్రం మళ్ళీ గెలవలేకపోయారు. అంతవరకూ ఎందుకు జగన్ పార్టీలో చేరాక 2014లో టికెట్ ఇచ్చినా ఓడారు. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం గెలిచారు. అపుడే అంబటి మంత్రి అని అంతా అనుకున్నారు. కానీ ఫస్ట్ ఫేజ్ లో అంబటిని పక్కన పెట్టారు.
అలా మూడేళ్ళు గడిచాకా సెకండ్ ఫేజ్ లో కూడా చివరి నిముషం వరకూ సస్పెన్స్ లో పెట్టి చివరికి మంత్రిని చేశారు. ఇక ఆయనకు జలవనరుల శాఖ ఇచ్చారు. అది మంచి శాఖే. కానీ దానికి ఉన్న తలనొప్పులు ఇపుడు మరే దానికీ లేవు. పోలవరం పీకులాటతో చాలు పుణ్యకాలం గడచిపోతుంది. అలా అంబటి రాజకీయాల్లో సీనియర్ అయినా మంత్రికి కొత్తగా అయిపోయారు.
ఏదో జగన్ ఇచ్చిన చాన్స్ తో రెండేళ్ళ కాలం నెట్టుకువద్దామనుకున్నారు. కానీ ఆయనను ఇపుడు టీడీపీ గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఎందుకంటే అంబటిది పెద్ద నోరు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే పోలవరం మొత్తం పాపం అంతా చంద్రబాబుదే అని బాంబులేశారు. అంతే కాదు, చంద్రబాబు వల్లనే మూడు వేల కోట్ల దాకా అదనపు ఖర్చు అంటూ అంతా బాబు గారి ఖాతాలో వేశారు.
దీనికి ముందు ఆయన టీడీపీని చీల్చిచెండాడారు. అంతేనా ఆ మధ్య అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడకుండా చేసిన వారిలో అంబటి ఒకరు. మాధవరెడ్డి అంటూ సభలో ఆయన మాట్లాడిన దానికే బాబు మండుకొచ్చి సభను బహిష్కరించారు. మరి ఇంత చేశాక మంత్రి అయిన అంబటిని టీడీపీ క్షమిస్తుందా.
అందుకే టార్గెట్ అంబటి అని టీడీపీలో ఆదేశాలు ఎక్కడికక్కడ జారీ అయ్యాయట. దాంతో ఇపుడు అంబటిని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గట్టిగానే తగులుకున్నారు. నీ చిట్టా మొత్తం బయటకు తీస్తాం, బర్తరఫ్ అంబటీ రెడీ నా అంటూ అయ్యన్న స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు. అంబటి అప్పట్లో ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్య్వూ విషయంలో మహిళా యాంకర్ ని ఇబ్బంది పెట్టారని కూడా అయ్యన్న చెబుతున్నారు. ఆధారాలతో సహా వాటిని బయటపెడతాం, ఇక మాజీవే అంబటీ అంటూ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు.
ఈ దెబ్బతో అంబటి తగ్గేది లే అంటూనే సౌండ్ మాత్రం ఎక్కడా చేయడంలేదు, కానీ మంత్రిని టార్గెట్ చేసిన టీడీపీ మాత్రం అసలు ఊరుకోదనే చెబుతున్నారు. అంబటి పదవిని ఊడగొట్టేంతవరకూ తాము విశ్రమించమని తమ్ముళ్ళు అంటున్నారు. దాంతో అంబటి రాజకీయ జాతకం తేల్చేస్తామని చెబుతున్నారు. మరి రాక రాక వచ్చిన పదవితో అంబటి ఇపుడు వారికి టార్గెట్ అయ్యారు. మరి అంబటి మీద టీడీపీ ప్లాన్ ఏంటి అన్నది చూడాలి.