లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు చేసిన అక్కాచెల్లెళ్ల వ్యవహారంపై పెద్దపల్లి ఎంపీ.. టీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ తాజాగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తాను కానీ తప్పు చేసినట్లు నిరూపిస్తే..లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా తాను ఉరి వేసుకుంటానని వ్యాఖ్యానించారు. దాదాపు వారం.. పది రోజుల క్రితం మంచిర్యాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంపీ బాల్క సుమన్ పై ఆరోపణలు చేయటం.. బంజారాహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి హడావుడి చేయటం.. బాల్కసుమన్ సహాయకుడిపై దాడికి యత్నించటం.. ఇంట్లో లేని ఎంపీని దుర్బాషలాడటం లాంటి తప్పులపై ఫిర్యాదు నమోదు చేశారు.
దీనికి సంబంధించిన అంశం రెండు రోజుల క్రితం బయటకు రావటం.. దీనిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం సాగింది. ఒక మీడియా సంస్థలో వచ్చిన వార్తతో మిగిలిన మీడియా మేల్కొనటం.. అదో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఎంపీ బాల్క సుమన్ స్పందించారు.
తనను బద్నాం చేయటానికే ఇద్దరు అక్కాచెల్లెళ్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. మంచిర్యాలకు చెందిన బోయిని సంధ్య.. బోయిని విజేతలు ఇద్దరు ఆర్నెల్ల క్రితం తనను మోసం చేయాలన్న ఆలోచనతో తన కుటుంబ ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లుగా ఆరోపించారు.
తన భార్య ఫోటో స్థానంలో సంధ్య తన ఫోటోను మార్ఫింగ్ చేసిందన్నారు. తనను బ్లాక్ మొయిల్ చేశారని.. ఈ అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసు అధికారులతో తాము బ్లాక్ మొయిల్ చేసేందుకే ఫోటోల్ని మార్ఫింగ్ చేసినట్లుగా ఒప్పకున్నట్లుగా చెప్పారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేసిన తప్పులకు ఆధారాల్ని సేకరించిన పోలీసులు ఫిబ్రవరి ఆరున వారిని అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరు పర్చారన్నారు. మళ్లీ ఈ మద్యన అక్కాచెల్లెళ్లు మళ్లీ బ్లాక్ మొయిల్ మొదలు పెట్టారన్నారు. తాను తప్పు చేస్తే ఉరేసుకుంటానంటూ సవాల్ విసిరారు.