అక్ర‌మ సంతానాన్ని ఎంపీ చేసిన ఘ‌నుడు ఆ మాజీ సీఎం

Update: 2018-04-18 16:43 GMT
త‌మిళ‌నాడు రాష్ట్రం ఎండ వేడిమి కంటే..రాష్ట్రంలోని రాజ‌కీయాల‌తో హీటెక్కుతున్నాయి. ఇప్ప‌టికే కావేరీ జ‌లాలకు సంబంధించిన అంశంతో ఆయా పార్టీల మ‌ధ్య వాడీ వేడి విమ‌ర్శ‌లు జ‌రుగుతుండ‌గా..తాజాగా మ‌రో వివాదం క‌ల‌క‌లం రేపుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళిని ఓ అక్రమ సంతానంగా అభివర్ణిస్తూ ఆయన తమిళంలో చేసిన ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. సీఎంకు అక్ర‌మ సంతాన అయినందుకు ఎంపీని చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

తమిళనాడు గవర్నర్ ఓ జర్నలిస్ట్‌ తో అసభ్యంగా ప్రవర్తించన ఉదంతం జాతీయ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మహిళా జర్నలిస్ట్‌తో అలా ప్రవర్తించడం సరికాదని కనిమొళి మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనిని తప్పుబడుతూ రాజా చేసిన ట్వీట్ మరింత దుమారం రేపింది. `పదో తరగతి కూడా పాస్ కాకుండా పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం ఏంటి అంటూ నిలదీసిన అన్నామలై యూనివర్సిటీ విద్యార్థి ఉదయ్‌కుమార్‌ను హత్య చేసిన కుటుంబం ఇప్పుడు దీనిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది` అని ఓ ట్వీట్‌లో రాజా అన్నారు. ఆ తర్వాత గవర్నర్‌ ను ఆ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ మరో ట్వీట్‌లో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. `అక్రమ సంబంధం ద్వారా వచ్చిన తన అక్రమ సంతానాన్ని ఎంపీని చేసిన ఆ నేతను ఇదే ప్రశ్న జర్నలిస్టులు అడుగుతారా? అడగలేరు.. ఎందుకంటే వాళ్లు భయపడతారు. చిదంబరం ఉదయ్‌ కుమార్ - అన్నానగర్ రమేష్ - పెరంబలూర్ సాదిక్ బాషాలను ఏం చేశారో వాళ్లకు తెలుసు` అని రాజా ఆ ట్వీట్‌ లో రాశారు. జా ఈ ట్వీట్‌ లో ప్రస్తావించిన ముగ్గురినీ కరుణానిధి - ఆయన కుటుంబం హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత ప్ర‌స్తావించార‌ని అంటున్నారు. ఆయనప్ప‌టికీ..ఓ మ‌మిళా ఎంపీ ప‌ట్ల‌ ప్ర‌వ‌ర్తించిన బీజేపీ నేత తీరును ట్విట్టర్‌లో నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు.
Tags:    

Similar News