కేంద్రంతో పోరాటంలో థర్మాకోల్ కత్తులతో సాము చేస్తున్న టీడీపీకి భిన్నంగా వైసీపీ అధినేత ఏకంగా రాజీనామాల అస్ర్తం ప్రయోగించడం, అందుకు తేదీ కూడా ప్రకటించడంతో పాలక టీడీపీ ఇరుకునపడింది. దీంతో టీడీపీ ఎంపీలు వైసీపీపై విమర్శలు కురిపించడం మొదలుపెడుతున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే తమనూ రాజీనామా చేయాలంటూ జనం డిమాండు చేస్తారన్న భయంతో టీడీపీ ఎంపీలు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అలాంటి విమర్శకుల నోళ్లు మూయిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటరేశారు.
ఎంపీల రాజీనామాకు కేంద్రం దిగిరాకపోతే అప్పుడేం చేయాలో కూడా తమ వద్ద కార్యాచరణ ఉందని బొత్స చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడే తాము అది వద్దని, హోదా కావాలని చెప్పామని తెలిపారు. హోదా సంజీవిని అని తమ పార్టీ భావిస్తోందని, అందుకే గ్రామాల్లోకి వెళ్తామని, అప్పుడు ఉద్యమం ఉధృతం అవుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తారా అని విలేకరులు అడగ్గా... హోదా కోసం కలిసి వచ్చే వారితో పోరాటం చేస్తామన్నారు. టీడీపీ మిత్రపక్షంగా జనసేన తేల్చుకోవాలన్నారు. మాకు ఏ పార్టీ మద్దతిచ్చినా స్వాగతిస్తామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కలిసి వస్తే కలుపుకుపోతామన్నారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని బొత్స చెప్పారు. ప్యాకేజీకి అర్థంలేదన్నారు. జిల్లాల్లోను తాము హోదా కోసం ఉద్యమం తీసుకు వస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి ప్రయోజనం అన్నారు. నాలుగేళ్లుగా తాము హోదా కోసం ధర్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. మా ఎంపీల రాజీనామాలతో దేశం మొత్తం ఏపీ ఆకాంక్షను గుర్తిస్తుందన్నారు.
కాగా రాజీనామాల అస్ర్తం ప్రయోగించగానే టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, జేసీ దివాకరరెడ్డిలు వైసీపీపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్లకార్డులు పట్టుకోలేని వాళ్లు రాజీనామా చేస్తారా - అది ఎలా నమ్మాలి - ప్రజలు ఎలా నమ్ముతారు అని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జగన్ రాజీనామా ప్రకటన అంతా డ్రామా అని, ఇప్పుడు ఎవరు నమ్ముతారని, వాటి ఆమోదానికే రెండు నెలల సమయం పడుతుందని జేసీ అన్నారు. వారికి సమాధానంగానే బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.