మ‌న‌సుల్ని దోచేలా బెంగ‌ళూరు-తిరుప‌తి బ‌స్సు!

Update: 2018-08-28 07:00 GMT
బ‌స్సులు చాలానే ఉంటాయి. కానీ.. ఇప్పుడు మీరు చ‌ద‌వ‌బోయే బ‌స్సు లాంటి దాని గురించి మీరెప్పుడూ విని ఉండ‌రు. వీవీఐపీలు.. సెల‌బ్రిటీలు.. రాజ‌కీయ నేత‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు ఉంటాయ‌ని.. వాటిల్లో బోలెడ‌న్ని స‌దుపాయాలు ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. కానీ.. సామాన్య ప్ర‌జానీకానికి అత్యాధునిక వ‌స‌తులు.. హంగుల‌తో ఉండే బ‌స్సుల గురించి మీరెప్పుడూ విని ఉండ‌రు. ఇప్పుడా కొర‌త తీరుస్తూ.. తాజాగా ఒక బ‌స్సు స‌ర్వీసు అందుబాటులోకి వ‌చ్చేసింది.

బెంగ‌ళూరు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుప‌తి వెళ్లే ఈ అత్యాధునిక బ‌స్సు గురించిన వివ‌రాలు తెలిస్తే.. వెంట‌నే ఇందులో ఎక్కాల‌నుకోవ‌టం ఖాయం. ఎందుకంటే.. ఇందులో ఉండే వ‌స‌తులు అలాంటివి మ‌రి. బ‌స్సు ప్ర‌యాణం అన్న వెంట‌నే చాలా మంది ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టానికి కార‌ణం బాత్రూం ప్రాబ్లం. ముఖ్యంగా మ‌హిళ‌లు బ‌స్సు జ‌ర్నీతో తీవ్ర అవ‌స్థ‌ల‌కు గురి అవుతుంటారు. కానీ.. ఈ బ‌స్సులో కెమిక‌ల్ టాయిలెట్ సుదుపాయం ఉంది.

అంతేనా.. 70 ఛాన‌ళ్ల‌తోకూడిన టీవీ ప్ర‌తి సీటుకు ఉంటుంది. ఇక‌.. ఇత‌ర బ‌స్సుల‌తో పోలిస్తే కాళ్లు చాపుకోవ‌టానికి వీలుగా ఉండే స్థ‌లం ఎక్కువ‌. వైఫై సౌక‌ర్యంతో పాటు.. టిఫిన్.. స్నాక్స్ .. వాట‌ర్ ఈ బ‌స్సులో అందిస్తారు. మ‌రో విష‌యం ఏమిటంటే.. వీట‌న్నింటికి డ‌బ్బులు పే చేయాల్సిన అవ‌స‌రం లేదు. మొత్తం టికెట్ లోనే క‌లిసి ఉంటాయి. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో అందిస్తున్న ఈ బ‌స్సు బెంగ‌ళూరు ఎయిర్ పోర్ట్ నుంచి ఉద‌యం 10 గంట‌ల‌కు.. రాత్రి 10 గంట‌ల‌కు ఉంటుంది.

ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ బ‌స్సు ఎక్కితే తిరుప‌తికి మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు చేరుకుంటారు. అదే రాత్రి 10 గంట‌ల‌కు ఎక్కితే తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు చేరుకుంటారు. తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లి స్వామి వారిని ద‌ర్శించుకునే వీలుగా ఈ బ‌స్సు స‌ర్వీసును ఏర్పాటు చేశారు. బ‌స్సు గురించి తెలిసిన వెంట‌నే.. అందులో జ‌ర్నీ చేయాల‌నిపించ‌లేదూ..?


Tags:    

Similar News