15,000 కోట్ల భారీ స్కామ్‌ను బయటపెట్టిన సీబీఐ.. !

Update: 2021-11-02 12:30 GMT
వజ్రాల వ్యాపారులైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు సంబంధించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసు కంటే ఎక్కువ విలువైన బైక్ బాట్ కుంభకోణం యూపీ లో సీబీఐ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబిఐ) 15,000 కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి నిందితులపై ఎఫ్‌ ఐఆర్‌ ను నమోదు చేసింది.ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి మరో 14 మందితో కలిసి దేశవ్యాప్తంగా దాదాపు రూ.15,000 కోట్ల పెట్టుబడిదారులను మోసం చేశారని ఆ ఎఫ్‌ ఐఆర్‌ లో నమోదు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సంజయ్‌ భాటి బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు.

బైక్ బాట్ స్కామ్‌ లో, నిందితుడు బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీస్ ముసుగులో అత్యంత లాభదాయకమైన పెట్టుబడులను పెట్టాడు. ఇం దులో కస్టమర్ ఒకటి, మూడు, ఐదు లేదా ఏడు బైక్‌ లలో పెట్టుబడి పెట్టవచ్చు. సంస్థ దానిని నడుపుతుందని పెట్టుబడిదారులను నమ్మించారు. పెట్టుబడిదారునికి నెలవారీ అద్దె, EMI బోనస్ బైనరీ నిర్మాణంలో అదనపు పెట్టుబడిదారులను చేర్పించడంపై ఇతర ప్రోత్సాహకాలను చెల్లిస్తామని నమ్మబలికారు. కంపెనీ వివిధ నగరాల్లో ఫ్రాంచైజీలను కేటాయించింది. అయితే ఈ నగరాల్లో బైక్‌ లు టాక్సీలు పెద్దగా పనిచేయడం లేదని సీబీఐ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా బైక్‌ టాక్సీల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు మోసపోయినట్టు సీబీఐ గుర్తించింది.

ఈ ప్లాన్‌ లు ఆగస్టు 2017లో బయటపడ్డాయి. పెట్టుబడిదారులు, కస్టమర్‌ల నుండి డబ్బు వసూలు చేయడం వారికి తిరిగి చెల్లింపులు 2019 ప్రారంభం వరకు కొనసాగాయి. నవంబర్ 2018లో, పెట్రోల్ బైక్‌లు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటు న్నాయని పేర్కొంటూ నవంబర్ 2018లో కంపెనీ ఇ-బైక్‌ల కోసం ఇలాంటి ప్లాన్‌లను విడుదల చేసింది. ఆపరేషన్. ఇ-బైక్‌ ల సబ్‌ స్క్రిప్షన్ మొత్తం సాధారణ పెట్రోల్ బైక్‌ ల పెట్టుబడి మొత్తాల కంటే దాదాపు రెట్టింపుగా ఉందని సీబీఐ తెలిపింది. ఇంత జరుగుతున్న అక్కడి పోలీసు అధికారులు ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బదులుగా, ఎస్ ఎస్ పి, ఎస్ పీ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సీబీఐ తెలిపింది. సంజయ్ భాటి, అతని సహచరులు పెట్టుబడిదారులను నుంచి ముందస్తు కుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా కనీసం 15,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించింది.


Tags:    

Similar News