ఇకపై ఓటీటీ, ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లకు సెన్సార్

Update: 2020-11-11 14:50 GMT
ఇకపై డిజిటల్ మీడియా, న్యూస్ కంటెంట్ , ఆన్ లైన్ న్యూస్ లపై కూడా నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిిచింది. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు ఆన్ లైన్ కంటెంట్ కార్యక్రమాలు ఇకపై డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా నిర్వహించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్, ఆన్ లైన్ కంటెంట్ ప్రొవైడర్లు, ఓటీటీలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ ఫిల్మ్ లు ఆడియో విజువల్ ప్రోగ్రామ్ లు, ఆన్ లైన్ న్యూస్ మరియు కరెంట్ అఫైర్స్ కంటెంట్ వంటివి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ పరిధిలోకి రానున్నాయి. టీవీ కంటే ఆన్ లైన్ మీడియాపై నియంత్రణ ఎక్కువ అవసరమన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా కోసం సుప్రీంకోర్టు ప్రమాణాలు నిర్ణయించాలంటే ముందుగా డిజిటల్ మీడియా కోసం చట్టం రూపొందించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ కంటెంట్ ప్రొవైడర్స్ ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటివరకు ప్రింట్ మీడియా వ్యవహారాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI), వార్తా ఛానళ్లను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్అ సోసియేషన్(NBA)మానిటర్ చేస్తుంటది. ప్రకటనల వ్యవహారాలను అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుండగా,సినిమాల విషయాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC)చూసుకుంటోంది. కానీ, డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టం లేదా ఇండిపెండెంట్ బాడీ లేదు. దీంతో, స్వయం ప్రతిపత్తి గల OTT ప్లాట్‌ఫామ్ లు, ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ ను నియంత్రించాలన్న ఓ పిటిషన్‌పై గత నెలలో సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. OTT ప్లాట్‌ఫామ్‌లలో న్యూస్ పోర్టల్స్ మరియు హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలు, ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లపై ఇకపై నియంత్రణ ఉండబోతోంది.
మీడియా స్వేచ్ఛను హరించే ఎలాంటి చర్యలు తమ ప్రభుత్వం తీసుకోదని గతేడాది కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. అయితే, ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సినిమాలకి ఉన్నట్లుగానే ఓటీటీ(ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్స్)లపై రెగ్యూలేషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News