టీమిండియా అదరగొట్టింది.. అంధుల క్రికెట్ లోనూ మనకు ఎదురులేదనిపించింది.. మూడోసారి టి20 ప్రపంచ కప్ ను తన సొంతం చేసుకుంది.. తెలుగు ఆటగాడు సెంచరీతో కదం తొక్కిన వేళ ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన ఫైనల్లో 120 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ కు చేరి న భారత్.. తుది సమరంలోనూ అంతే దమ్ము చూపింది. కాగా, ఇప్పటివరకు మూడుసార్లు కప్ గెలిచిన మన జట్టు మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో రికార్డును సొంతం చేసుకుంది.
బెంగళూరులో భళా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా చక్కటి ప్రదర్శన కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన మన జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 272 పరుగులు చేసింది. ఫలితంగా 273 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడు వికెట్లే కోల్పోయినప్పటికీ పరుగుల వేటలో వెనుకబడింది. భారత బౌలర్ల పకడ్బందీ బౌలింగ్ తో వేగంగా పరుగులు చేయలేకపోయింది. కాగా, భారత్ 2012, 2017లోనూ ప్రపంచ విజేతగా నిలిచింది.
రమేష్, అజయ్ రెడ్డి శతకాలు టీమిండియా భారీ స్కోరు వెనుక సునీల్ రమేష్ (63 బంతుల్లో 136 నాటౌట్), తెలుగువాడు అజయ్ కుమార్ రెడ్డి (50 బంతుల్లో 100 నాటౌట్) శతకాలున్నాయి. మరీ ముఖ్యంగా అజయ్ 200 స్ట్రయిక్ రేట్ తో చెలరేగాడు. దీంతో 20 ఓవర్లలో 247 పరుగులు భారీ స్కోరు సాధించింది. అయితే, వీరిద్దరూ బరిలో దిగినప్పటి పరిస్థితులు వేరు.
కేవలం 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును 247 పరుగుల వరకు తెచ్చారు. దూకుడే మంత్రంగా ఆడిన వీరు.. మూడో వికెట్ కు 218 పరుగుల భారీ అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇక ఈ లక్ష్యాన్ని చూసి బెదిరిన బంగ్లా ఏ దశలోనూ దానిని అందుకునేలా కనిపించలేదు. బ్యాటింగ్ లో సెంచరీతో చితక్కొట్టిన అజయ్.. బౌలింగ్ లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. లలిత్ మీనా మరో వికెట్ తీశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.