కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ అనుబంధం అనేది తుమ్మితే ఊడిపోయే ముక్కు సామెతలాగా మారిపోయింది. అది ఏ క్షణాన పుటుక్కు మంటుందో తెలియదు. మొన్నమొన్నటి దాకా అయితే ఏం జరిగి ఉండేదో ఇప్పుడు చెప్పలేం గానీ.. బడ్జెట్ తర్వాత.. ఏర్పడిన ప్రతిష్టంభన - తాజాగా గురువారం నాడు - తెదేపా కటీఫ్ కు నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడి కావడం.. ఇత్యాది పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం ప్రతిపాదనలకు కేంద్రం ఏమేరకు సుముఖంగా స్పందిస్తుందనేది అనుమానమే. ఇన్ని ఇబ్బందులుండగా.. సీఎం చంద్రబాబునాయుడు మాత్రం.. కేంద్రాన్ని ఒప్పించి.. కాపుల బిల్లు ఆమోదం పొందేలా చూస్తా అని హామీ ఇచ్చేస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్ కల్పించడం గురించి.. చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చినప్పటికీ మూడున్నరేళ్లపాటూ సాగతీస్తూ వచ్చారు. కాపుల్లో ఆందోళన ఉధృతం కావడం - ఇంతకంటె సాగతీస్తే పరిస్థితులు బెడిసికొట్టే వాతావరణం ఏర్పడడంతో చివరికి ఆయన గత అసెంబ్లీ సమావేశాల సమయంలో హడావుడిగా బిల్లును తయారుచేయించి అసెంబ్లీలో ఆమోదించేసి.. చట్టబద్ధత కోసం కేంద్రానికి పంపేసి చేతులు దులుపుకున్నారు.
తీరా నిబంధనల ప్రకారం బిల్లు లేదని, రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలో సరైన కారణాలను చెప్పకపోవడం వల్ల ఆమోదం కుదరదని సిబ్బంది శాఖ - హోం కు సూచించడంతో ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాపు వర్గం నుంచి అలజడి మొదలైంది. అసలు రిజర్వేషన్ వస్తుందా రాదా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా లేదా? అనే ప్రచారం మొదలైంది. అయితే చంద్రబాబునాయుడు నేను కేంద్రాన్ని కన్విన్స్ చేసి బిల్లు ఆమోదింపజేస్తా అని పార్టీ సీనియర్లతో సమావేశంలో చెబుతున్నారట. ఇదివరకటి పరిస్థితి వేరు. ఇప్పుడు అన్నీ పద్ధతిగా ఉన్న విభజన చట్టం అంశాలే పొందలేకపోతున్న నేపథ్యంలో.. తప్పులున్న బిల్లును ఆమోదించేంత ఇమేజి మనకున్నదా అని పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.