చిరాకు పుట్టించే వారి పట్ల కూడా సౌమ్యంగా మాట్లాడే ఓర్పు.. నేర్పు రాజకీయ నేతలకు చాలా అవసరం. ఇక.. రాజకీయ అధినేతలకైతే ఇలాంటివే కీలకం. ఏ మాటలకు వారెంతగా ఇరిటేట్ అవుతారన్నవిషయం మీద అందరూ ఓ కన్నేసి ఉంటారు. అందుకే రాజకీయ అధినేతలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం అందుకు భిన్నం. చేతిలో పవర్ ఉన్నప్పుడు ఆయన వేటిని పెద్దగా పట్టించుకోరు. ఆత్మవిశ్వాసం పెరిగిన వేళ.. ఆయన మాటలు సైతం మారిపోతుంటాయి. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పే ఆయనే.. అధికారంలోకి వచ్చినంతనే.. ‘‘ఆ.. మీకేం కావాలి’’ అంటూ అధికార దర్పం ఉట్టిపడేలా మాట్లాడతారు.
ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తారన్న విషయం చంద్రబాబుకు తెలీదన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. తప్పుల్ని ఎత్తి చూపించి.. సరిదిద్దే వ్యవస్థ బాబు చుట్టూ లేకపోవటంతో.. ఆయన తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. ఎవరైనా విమర్శిస్తే.. అవి టీడీపీకి వ్యతిరేకమన్న దృష్టితోనే చూస్తారు కానీ.. తప్పులు ఎత్తి చూపే వాళ్లంతా తనకు శత్రువులని ఫీల్ కావటంలో అర్థం లేదు. అభిమానించే వారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారన్న విషయాన్ని బాబు అండ్ కో గుర్తిస్తే మంచిది.
పెరిగిన మీడియా పుణ్యమా అని ప్రతి మాటను రకరకాలుగా ప్రచారం జరిగే పరిస్థితి. నోటి నుంచి వచ్చే మాటల్లో ముందు మాటను.. వెనుక మాటను కట్ చేసి.. తమకేం కావాలో.. ఏదైతే ప్రత్యర్థిని దెబ్బ తీసేందుకు కుదురుతుందో.. అదే మాటను పదే పదే టెలికాస్ట్ చేయటం మామూలే. ఇప్పుడు అందుకు జతగా.. సోషల్ మీడియా ఒకటి వచ్చి చేరింది. తమ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు వీలుగా.. వీడియోలు ఎడిట్ చేసి.. చివర్లో తమ అసంతృప్తిని పంచ్ రూపంలో జత చేసి.. జనాల్లోకి వదలటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి విషయాల్ని గుర్తించి.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించటం ఇప్పుడు ఇబ్బందిగా మారింది.
ఆయన మాట్లాడే వేళ.. ఎవరైనా తమ డిమాండ్లను వినిపిస్తే చంద్రబాబుకు ఒళ్లు మండిపోతుంది. రోజుకు 18 గంటలకు పైనే పని చేస్తూ.. రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే.. అదేమీ గుర్తించకుండా తమ అవసరాల గురించి నలుగురిలో నిలదీయటాన్ని ఆయన అస్సలు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి ఎదురైన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ప్రత్యర్థులకు బందర్ లడ్డూల్లా మారుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం పొట్టిపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగం జోరుగా సాగుతున్న వేళ.. ఒక వ్యక్తి లేచి.. రేషన్ షాపుల్లో పామాయిల్.. కందిపప్పు ఇవ్వటం లేదని నిలదీశారు. దీంతో.. బాబుకు ఒళ్లు మండిపోయింది. ‘‘నీకేం కావాలి.. నీకేం ఇబ్బందులు ఉన్నాయి?’’ అని ప్రశ్నించినప్పుడు సమస్యలు చెప్పుకోవాలే కానీ.. తాను మాట్లాడుతున్నప్పుడు ఇలా అడగటం ఆయనకు చిరాకు తెప్పించినట్లుంది. అందుకే ఆయన నోటి నుంచి వెరైటీ వ్యాఖ్యలు వచ్చేశాయి.
అన్ని నేనే చేసేస్తే.. మీరేం చేస్తారని ప్రశ్నించటమే కాదు.. వంట చేసుకోలేని వారి కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజల తీరు చూస్తుంటే.. వంట కూడా తననే చేయమనేటట్లుందంటూ కాస్త వ్యంగ్యంగానే వ్యాఖ్యానించారు. తాను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్ట్రబ్ చేసే వారి విషయంలో ఇరిటేట్ కాకుండా.. అలా ప్రశ్నలు సంధించే వారు సైతం నవ్వుతూ కూర్చునేలా సమాధానం ఇవ్వాల్సిన అవసరాన్ని బాబు గుర్తిస్తే మంచిది. లేకుంటే.. ఇలాంటి సిరాకులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయన్నది మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/