ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాజకీయాల్లో చాణుక్యుడని పేరు.. రాజకీయాల్లో చదరంగాన్ని మించిన ఎత్తులు వేయడంలో సిద్ధహస్తుడు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆ విషయం ఎన్నోసార్లు రుజువైంది. రాజకీయ శత్రువులు - ప్రతిపక్ష నేతలు తనపై వేసే కేసులను ఎదుర్కోవడం - వాటి నుంచి బయటపడడంలోనూ చంద్రబాబు నేర్పరే. అయితే.. నవ్యాంధ్ర సీఎంగా రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు కొద్దికాలంగా కేసుల బెడద ఎదుర్కొంటున్నారు. తన తెలివితేటలతో కేసుల చిక్కుముళ్లను విప్పుకుంటూ వెళ్తున్నా మళ్లీమళ్లీ చిక్కులు పడుతుండడం ఆయనకు చికాకు తెప్పిస్తోంది. అయితే.. ఈ రెండున్నరేళ్ల పాలనలోనే ఎన్నో కేసులను ఎదుర్కొన్న చంద్రబాబుకు ఈ టెర్ములో మిగిలిని రెండున్నరేళ్లు మరింత కష్టకాలమే అని రాజకీయ పండితులు అంటున్నారు. చంద్రబాబును కేసులతో కట్టిపడేసేందుకు విపక్ష వైసీపీ అధినేత జగన్ వ్యూహం పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే చంద్రబాబుకు కష్టకాలమే మరి.
ఇప్పటికే చంద్రబాబు రెండు బలమైన కేసుల్లో చంద్రబాబు పాత్ర కీలకం కావటంతో సదరు కేసుల్లో నుండి బయటపడటానికి ముఖ్యమంత్రి నానా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ కేసులే చంద్రబాబు మెడకు బలంగా చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చంద్రబాబు ఎదుర్కొంటున్న కేసులు రెండూ చిన్నవేమీ కావు... ఏమాత్రం తేడా కొట్టినా రాజకీయంగా పరువు పోవడం ఖాయం. ఒకటి ఓటుకు నోటు కేసు కాగా రెండోది స్విస్ చాలెంజ్ కేసు. రెండు కేసులు కూడా చంద్రబాబును బాగానే ఇరుకున పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎన్ టి రామారావుపైన కూడా నాటి కాంగ్రెస్ నేత ద్రోణం సత్యనారాయణ అనేక కేసులు వేసారు. సదరు కేసుల్లో చాలా వరకూ వీగిపోయాయి. అయితే, ఒకటి రెండు కేసులు మాత్రం ఎన్ టిఆర్ మెడకు బాగానే చుట్టుకున్నాయి. అదే విధంగా ఇపుడు చంద్రబాబు కూడా ఇబ్బందులు తప్పవా అన్న అనుమానం సర్వత్రా వినిపిస్తోంది.
దాదాపు ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ లో వెలుగు చూసిన ఓటుకునోటు కేసు జాతీయ స్ధాయిలో ఒక సంచలనమే. శాసనమండలి సభ్యుల ఎన్నికల విషయంలో తెలంగాణా నామినేట్ చేసిన స్టీఫెన్ సన్ ఓటుకు టిడిపి బేరం పెట్టిన కేసు చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసింది. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు వెలుగు చూసాయి. దాంతో చంద్రబాబును ఈ కేసులో నుండి బయటపడేయటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదని అప్పట్లో తెలంగాణా ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు ప్రకటించటం గమనార్హం. అయితే, ఆ తర్వాత జరిగిన తెరవెనుక పరిణామాల నేపధ్యంలో పదేళ్లు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను చంద్రబాబు మొదటి ఏడాదిలోనే అర్ధాంతరంగా వదిలేసారు. అప్పటి నుండి దాదాపు హైదరాబాద్ కే రావటం మానుకున్నారు. ఇంకోవైపు తెలంగాణాలో టిడిపి భూస్ధాపితమవుతున్నా పట్టించుకోవటం లేదు. ఈ రెండు అంశాలు కెసిఆర్ పెట్టిన షరతుల ఫలితమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. కెసిఆర్ అభీష్టం మేరకే చంద్రబాబు నడుచుకుంటుండటంతో న్యాయస్ధానంలో ఓటుకునోటు కేసు కూడా నత్తను తలపిస్తోంది. ఈ నేపధ్యంలో హటాత్తుగా ఓటుకునోటు కేసు వేగం పుంజుకుంది. అందుకు కారణం ప్రధాన ప్రతిప క్షమైన వైసీపీ సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డే. ఓటుకునోటు కేసులో చంద్రబాబు సూత్రదారిగా ఎసిబి కూడా అభిప్రాయపడుతోంది. ఎందుకంటే - ఓటుకునోటు కేసు చార్జిషీటులో చంద్రబాబు పేరును ఏకంగా 33 చోట్ల ప్రస్తావించటం గమనార్హం. అందుకనే, స్టీఫెన్ సన్ తో మాట్లాడింది చంద్రబాబేనా కాదా అన్న విషయాలను వైసీపీ ఎంఎల్ ఏ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నుండి ధృవ పరుచుకుని సదరు నివేదికను కోర్టులో సమర్పించారు. ఇంతటి కీలకమైన కేసులో నిజాలు బయటకు రావలంటూ కేసు దాఖలు చేసారు. దాంతో కేసును విచారించాల్సి నివేదిక అందచేయాల్సిందిగా ఏసిబి న్యాయస్ధానం ఏసిబి ఉన్నతాధికారులను ఆదేశించింది. దాంతో ఒక్కసారిగా కేసు విచారణ వేగవంతమైంది. అయితే, ఏసిబి విచారణపై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు.
ఇక రాజధాని భూ సమీకరణ - మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత సింగపూర్ కు అప్పగించటంపై విమర్శలున్నాయి. స్విస్ చాలెంజి విధానంపై వేసిన కేసులోనూ కోర్టు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. స్విస్ చాలెంజ్ విధాన ప్రక్రియపై న్యాయస్ధానం స్టే ఇచ్చింది కూడా. ఆ స్టేని వెకేట్ చేయించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మంగళవారం విఫలమైంది. దాంతో చంద్రబాబు మెడకు పై రెండు కేసులు బాగానే చుట్టుకునేట్లు కనబడతున్నాయి. చంద్రబాబుపై వీలైనన్ని రకాలుగా న్యాయస్ధానాల్లో కేసులు దాఖలు చేయటం ద్వారా ముప్పు తిప్పలు పెట్టాలని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనబడుతోంది. న్యాయస్ధానాల్లో కేసుల విచారణను ఎదుర్కొంటున్నది తానొక్కడినే కాదని... తనను వేలెత్తి చూపుతున్న చంద్రబాబుదీ అదే పరిస్థితని ప్రజలకు చెప్పేందుకే జగన్ కేసుల వ్యూహం రచిస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికి కారణమేదైనా చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయమని అంటున్నారు.