త‌మ్ముళ్ల తీరుతో బాబు ఒళ్లు మండిపోయింది!

Update: 2018-09-06 06:35 GMT
నిజమా? అన్న మాట మీ నోటి వెంట రావొచ్చు. కానీ.. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన త‌ర్వాత మీక్కూడా ఇలాంటి సందేహ‌మే రావ‌టం ఖాయం. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి పాల్గొనే  కార్య‌క్ర‌మానికి మంత్రులు.. ఎమ్మెల్యేలు రావాల‌ని కోరిన త‌ర్వాత స్పంద‌న ఎలా ఉంటుంది?  ఒక రేంజ్లో ఉంటుంద‌ని ఎవ‌రైనా చెబుతారు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఈ రోజు (గురువారం) నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు షురూ అయ్యాయి. దీనికి ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెంక‌టాయ‌పాలెంలో ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి.. నివాళులు అర్పించే ప్రోగ్రామ్ ఒక‌టి పెట్టుకున్నారు. దీనికి మంత్రుల‌తో స‌హా పార్టీ ఎమ్మెల్యేల్ని కూడా రావాల‌ని కోరారు.

మామూలుగా అయితే.. ఇలాంటి ఆహ్వానం అందిన వెంట‌నే బిల‌బిల‌మంటూ నేత‌లంతా క్యూ క‌డ‌తారు. కానీ.. పాల‌న మీదా.. సొంత పార్టీ మీద ప‌ట్టు త‌ప్పింద‌న్న విమ‌ర్శ బాబు మీద వినిపిస్తున్న వేళ‌.. అలాంటి వార్త‌ల్నినిజం చేసేలా సీఎం బాబు పాల్గొన్న కార్య‌క్ర‌మానికి మంత్రులు.. ఎమ్మెల్యేలు పెద్ద‌గా పాల్గొన‌టంతో బాబుకు కోపం వ‌చ్చింది.

పార్టీ నేత‌ల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ప‌ద‌వులు పొందిన త‌ర్వాత బాధ్య‌త‌లు మ‌ర్చిపోతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించే వేళ‌లో బాబు వెంట కేవ‌లం 15 మంది మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని భావించిన బాబుకు.. తెలుగు త‌మ్ముళ్లు ఇచ్చిన షాక్ తో దిమ్మ తిరిగిపోయిందంటున్నారు. బాబును పిచ్చ లైట్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలుగు త‌మ్ముళ్లు.. అధినేత ఆగ్ర‌హాన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.  


Tags:    

Similar News