ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అపారమైన భక్తిని ప్రదర్శిస్తుంటారు. అలిపిరి బాంబు బ్లాస్టులో తను బయటపడ్డది తిరుపతి వెంకటేశ్వరస్వామి వల్లే అని ఆత్మీయ సంభాషణల్లో చెప్పారు కూడా. అలాంటి చంద్రబాబు దేవుళ్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు... కొన్ని వర్గాల నుంచి నిరసనలు కూడా వస్తున్నాయి.
చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ అధికార పగ్గాలు చేపట్టి పదినెలలు దాటుతోంది. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని దేవాలయాలకు పాలకమండళ్లను నియమించలేదు. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి ఇప్పటికీ పాలకమండలి లేదు. టీటీడీతో పాటు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం, శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవాలయానికి సైతం పాలకమండల్లు లేవు. చంద్రబాబు అదికారంలోకి వచ్చిన తర్వాతే ఈ నియామకం చేపడితే ఇప్పటికీ తొమ్మిది నుంచి పదినెలలు గడిచిపోయేది. కానీ ఆ విధంగా చేయలేదు.
పాలకమండల్లు లేకపోవడం వల్ల సంబంధిత దేవాలయం నిర్వహణ కుంటుపడుతుంది. ఆయా ఖర్చులకు అనుమతులు, వచ్చిన వాటిని ఒక పద్దతి ప్రకారం ఖర్చు చేయకపోవడం జరగవచ్చు. మరోవైపు ఎవ్వరి బాధ్యత లేకపోవడం వల్ల దేవాలయం నిర్వహణ గాడితప్పి భక్తులకు అవస్థలు ఎదురవుతాయి.
మరోవైపు ఈ కమిటీల నియామకంలో జరుగుతున్న ఆలస్యంపై కొందరు టీడీపీ నాయకుల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆయా పాలకమండల్లకు కమిటీలు వేస్తే చైర్మన్, సభ్యులుగా కొందరికి అవకాశం దక్కుతుంది. తద్వారా పలువురికి గుర్తింపు కూడా దొరుకుతుంది. ఈ అంశం చంద్రబాబుకు సైతం మేలు చేకూరుతుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు కట్టబెట్టడం ద్వారా గుర్తింపు దక్కిందనే గౌరవంతో మరి కొందరు ఆసక్తిగా పనిచేస్తారు.