ఏపీ భవిష్యత్తు మీద బాబు మార్క్ జోస్యం... ?

Update: 2021-11-30 00:30 GMT
చంద్రబాబు అనుభవం కలిగిన నాయకుడు. ఆయనకు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న పేరుంది. దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. నాడు సైబరాబాద్ ని బాబు సృష్టించకపోతే ఈ రోజున తెలంగాణా రాష్ట్రంలో అంత పెద్ద ఉపాధి కేంద్రం వచ్చి ఉండేది కాదు. ఇలా చాలా విషయంలో బాబు దూరదృష్టి గొప్పది. అయితే చంద్రబాబు విభజన ఏపీ సీఎం అయ్యాక జనాల్లో కూడా అలాంటి ఆశలే పెరిగాయి. అయిదేళ్ల స్వల్ప వ్యవధిలో బాబు మరో సైబరాబాద్ ని ఏపీకి క్రియేట్ చేసి ఇస్తాడు అని కలలు కన్నారు. అయితే అది అంత ఈజీ కాదు, దానికి తోడు వైసీపీ గట్టి ప్రతిపక్షంగా ఉండడంతో జనాలు జగన్ కి ఒక చాన్స్ ఇచ్చారు.

ఇక జగన్ పాలన సగం దాకా వచ్చింది. దాని మీద ప్రజల తీర్పు రావడానికి మరో సగం కాలం మిగిలి ఉంది. అయితే రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబు లాంటి  వారు అయితే జగన్ ఏలుబడిని కరెక్ట్ గా విశ్లేషించి తమదైన మార్కులు వేస్తున్నారు. అంతే కాదు ఏపీ ఫ్యూచర్ ని కూడా వారు చెప్పేస్తున్నారు. తాజాగా పార్టీ నాయకులతో చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం రెండున్నరేళ్లలోనే  జగన్ ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా నాశనం చేసింది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసి జనాలను మభ్యపెట్టి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. దాన్ని టీడీపీ నేతలు బలంగా తిప్పికొట్టలేకపోయారని  ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని ఆయన పేర్కొంటూ ఏపీ భవిష్యత్తుని తలచుకుంటే బెంగ వేస్తోందని కూడా చెప్పడం విశేషం. ఏపీని బాగు చేయాలీ అంటే మరో ఇరవ‌య్యేళ్లు గడచినా సాధ్యపడుతుందా అని బాబు లాంటి అనుభవశాలి అనడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఏపీకి సమీప భవిష్యత్తులో వెలుగు రేఖలు లేవు అన్నట్లుగా బాబు మాట్లాడారు. అంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఏపీని చక్కదిద్ది ఒక లెక్కకు తీసుకువావడానికి కచ్చితంగా రెండు దశాబ్దాలకు పైగా టైమ్ పడుతుంది అని భావించాల్సి ఉంటుంది. అంటే చాలా సులువుగా రెండు తరాలు ఈ మధ్యలో నలిగి పోవాల్సిందే అన్న మాట. మొత్తానికి ఏపీకి తీరని నష్టమే వాటిల్లింది. దానికి కారకులు ఎవరు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే బాబు జగన్ తో పాటు కేంద్రం కూడా అతి పెద్ద ముద్దాయిగా ఉండడం వల్లనే ఏపీ ఇలా అన్ని రకాలుగా కూరుకుపోయింది అని నిక్కచ్చిగా ఎవరైనా చెప్పే మాట మరి.
Tags:    

Similar News