భర్తల మోసం... భార్యలు ఎందుకు వదిలిపెట్టడం లేదు..?

Update: 2023-01-06 05:42 GMT
దాంపత్య జీవితంలో  ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే  లైఫ్ అందంగా ఉంటుంది. కానీ కొందరు చిన్న చిన్న సమస్యలకే హైరానా పడిపోతుంటారు.  వీటిని తట్టుకోలేక  విడాకుల వరకు వెళ్లడంతో ఈ మధ్య ఫ్యామిలీ కోర్టులు కిటకిటలాడుతున్నాయి. ఎక్కువ శాతం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలు మోసం చేశారనే ఆరోపణలే వినిపిస్తున్నాయి. పెళ్లికి ముందు ఎంతో నమ్మకంగా ఉండి.. పెళ్లయిన తరువాత క్యారెక్టర్ మార్చుకున్నారని అంటున్నారు. అయితే  కొందరు తమ భర్తలు ఎంత మోసం చేసినా వారిని వదలడం లేదు. వారితోనే కలిసి ఉంటూ కాపురం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అదేంటంటే..?

భార్యా భర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తాయి. కానీ తమ భర్త వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలిస్తే ఏ భార్య ఒప్పుకోదు. వివాహేతర సంబంధం విషయంలో తప్పెవరిది అయినా భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్లు ఒక భర్తను ఇద్దరు ఆడాళ్లు షేర్ చేసుకోవడం చాలా తక్కువ. అయతే కొందరు తమ భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నా ఒప్పేసుకుంటున్నారట.  

ఈ మధ్య ఒకావిడ సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంది. 'తన భర్త వేరొక అమ్మాయితో సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. అయినా నేను నా భర్తను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ తిరిగినా చివరికి ఇంటికే వస్తారు. నన్ను, నా పిల్లల్ని బాధ్యతగా చూస్తాడు. అందువల్ల నేను అతని నుంచి దూరం కావాలనుకోవడం లేదు' అని తెలిపింది.

అలాగే మరో మహిళ 'నా భర్త ఇంటి యజమానితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  ఆ విషయంలో నా భర్త తప్పు ఉందని నేను అనుకోను. ఎందుకంటే మా ఆయన బాగుంటాడు. అందుకే ఇంటి యజమాని నా భర్తను వలలో వేసుకుంది. మా ఆయన మంచోడు. అందువల్ల నేను అతన్ని విడిపెట్టాలని అనుకోవడం లేదు' అని పేర్కొంది.

ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. భర్తలు ఎలాంటి తప్పులు చేసినా తమను బాగా చూసుకుంటాడనే భావన చాలా మందిలో ఉంది. అందుకే భర్తలకు దూరం కావడం లేదు. ఒకవేళ ఆ వ్యవహారాలు నచ్చక విడాకులు తీసుకున్నా.. తమ పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. భర్తను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. అతనితో జీవితం బాగుంటుందని తెలియదు. అందువల్ల ఒక్కసారి పెళ్లిచేసుకున్న భర్తతోనే జీవితాంతం ఉంటానని కొందరు చెబుతున్నారు. అయితే భర్తలే తమ కుటుంబ బాధ్యతలను గుర్తించి తప్పులు చేయకుండా ఉంటే సంతోషిస్తామని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News