పోయేటప్పుడు తీసుకెళ్లేదేమీ లేదు. ఎంత సంపాదించినా.. అవన్నీ విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందే తప్పించి.. ఏదీ వెంట రాదు. మహా అయితే.. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుంటే వాటిని ప్రస్తావిస్తుంటారు. అదే.. ఎదవ పని చేస్తే చచ్చిన తర్వాత కూడా తిట్టి పోస్తారు. ఈ విషయం విడి రోజుల్లో గుర్తున్నా.. గుర్తు లేకున్నా..పెను సంక్షోభం మీద వచ్చి పడినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలే తప్పించి కాసుల కక్కుర్తికి అస్సలు పోకూడదు.
కానీ.. ఈ విషయంలో చైనాకు చెందిన ఒక మెడికల్ షాపు యాజమాన్యం మరిచిపోయింది. కరోనా వైరస్ కారణంగా.. దేశంలో మాస్కుల కొరత భారీగా ఏర్పడింది. దీంతో.. ఉన్న మాస్కుల్ని మామూలు ధర కంటే ఆరు రెట్లు ఎక్కువగా అమ్ముతున్న ఒక మెడికల్ స్టోర్ కు చైనా ప్రభుత్వం భారీగా ఫైన్ వేసింది. బీజింగ్ లోని ఈ కక్కుర్తి మెడికల్ షాపుకు షాకిస్తూ ఏకంగా రూ.3 కోట్ల మేర జరిమానా విధించారు.
అమ్మాల్సిన ధర కంటే ఆరు రెట్లు అధిక ధరకు మాస్కుల్ని అమ్ముతున్న నేపథ్యంలో అలా అమ్ముతున్న జిమిన్ కంగ్టై ఫార్మసీ దుకాణదారుకు భారీ జరిమానా విధించారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కు జన్మస్థలి అయిన వూహాన్ కు 4100 మంది వైద్యుల్ని చైనా ప్రభుత్వం పంపింది. అక్కడి అవసరాల వీరు సరిపోకపోవటంతో మరో 1800 మందిని కూడా అక్కడకు పంపేందుకు రెడీ అవుతున్నారు.
వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. చాలామంది చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. భయంతో దేశాన్ని విడిచి వెళ్లొద్దంటూ చైనీయులకు జిన్ పింగ్ సర్కారు సూచన చేసింది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ ను పిశాచితో పోల్చటమే కాదు.. దాంతో తాము పోరాడుతున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.