ఒలింపిక్స్ లో మనోళ్ల లూప్ హోల్స్ పసిగట్టేశారు

Update: 2016-08-12 04:52 GMT
సరిగ్గా మన దేశంలోని ఒక చిన్న రాష్ట్రంలో ఉండే జనాభాతో ఉండే దేశాలు సైతం ఒలింపిక్స్ లో పతకాలు సాధిస్తుంటే.. 134 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్ లో పతకం సాధించలేక చతికిలపడిన దైన్యం ప్రతి భారతీయుడ్ని కలచివేస్తోంది. పలు రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల వారితో పోటీ పడుతున్న వేళ.. విశ్వక్రీడల్లో ఒక్కటంటే ఒక్క పతకం కూడా ఇప్పటివరకూ సాధించలేని వైనం తెలిసిందే. ఒలింపిక్స్ లో భారత్ ఎందుకు ఫెయిల్ అవుతోంది? ఎక్కడ జరిగిన తప్పుల కారణంగా ఒలింపిక్స్ లో భారత్ రాణించటం లేదు?

ఇలాంటి పలుప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు నడుం బిగించింది చైనా మీడియా సంస్థ ఒకటి. జనాభా విషయంలో చైనాతో ఇంచుమించు సమానంగా ఉన్నట్లుగా కనిపించే ఇండియాకు ఒక్కటంటే ఒక్క ఒలింపిక్ పతకం రాకపోవటంపై సదరు చైనా మీడియా సంస్థ ఒక విశ్లేషణ చేయటంతోపాటు.. పతకాల పట్టికలో ఖాతా ఓపెన్ చేయకపోవటాన్ని ఉన్న అసలు కారణాల్ని వివరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్ ను తప్పు పట్టే క్రమంలో చైనాను ఎత్తేయటం లాంటివి లేకుండా కేవలం కారణాల్ని అన్వేషించి విశ్లేషణ రూపంలోనే కథనం ఇచ్చారు.

ఒలింపిక్స్ లో భారత వైఫల్యం గురించి చైనా మీడియా చెప్పిన కారణాలు చూస్తే..

= మౌలిక వసతులు సరిగా లేకపోవటం.. ప్రజారోగ్యం బలహీనంగా ఉండటం

= గ్రామీణ ప్రాంతాల్లో ఒలింపిక్స్ క్రీడల గురించి తెలీకపోవటం

= పిల్లల్ని పుట్టిన వెంటనే అయితే ఇంజనీరింగ్.. లేదంటే డాక్టర్లు చదివేయాలని తల్లిదండ్రులు భావించటం

= పేదరికం

= క్రీడల్లో పాల్గొనేందుకు బాలికలకు అనుమతి లభించకపోవటం

= మిగిలిన క్రీడల కంటే క్రికెట్ కు ప్రజాదరణ భారీగా ఉండటం

= భారత జాతీయ క్రీడ అయిన హాకీ తన వైభవం కోల్పోవటం
Tags:    

Similar News