ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పట్టపగలే...జగన్ వంటి హై ప్రొఫైల్ వ్యక్తిపై కట్టుదిట్టమైన భద్రత మధ్య దాడి జరగడం చర్చనీయాంశమైంది. విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడిని జాతీయ స్థాయి నేతలనుంచి రాష్ట్ర స్థాయి నేతలు - సినీ ప్రముఖులు - వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఖండించారు. ఆసుపత్రికి వెళ్లి కొందరు పరామర్శించగా...ఫోన్ లో మరికొందరు జగన్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. తాజాగా, వైఎస్ జగన్‌ను ప్రముఖ హీరో - కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి ఫోన్ లో పరామర్శించారు.
జగన్ ఆరోగ్య వివరాలను చిరు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవితో పాటు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య - సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా జగన్ ను ఫోన్ లో పరామర్శించారు. జగన్ త్వరగా కోలుకోవాలని వారంతా ఆకాంక్షించారు. మరోవైపు - జగన్ కు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు నేడు మరోసారి పరీక్షలు నిర్వహించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జగన్ కు మరి కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం జగన్ లోటస్ పాండ్ లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.