రాజకీయాల్లో చిన్న చిన్న పరిణామాలే చివరకు హెడ్ లైన్స్‌కు దారి తీస్తాయి. అటువంటిదే ఇప్పుడు కాంగ్రెస్ ధోరణిలో కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక వెబ్ సైట్ లో దర్శన మిచ్చిన ఒక ట్వీట్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తూ, కాంగ్రెస్ ధోరణికి దర్పణం పడుతోంది. సంజయ్ గాంధీ వర్థంతి సందర్బంగా అధికారిక వెబ్ సైట్ ద్వారా నివాళులు అర్పించిన కాంగ్రెస్ తన ఆంతర్యాన్ని బయటపెట్టింది.
సోనియా గాంధీ - మేనకా గాంధీ కుటుంబాల మధ్య వైరం ఉందని, అందుకే వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉంటున్నారనే విషయం అందిరికీ తెలిసిందే! అయితే ఇన్ని సంవత్సరాల తరువాత తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంజయ్ గాంధీ సమాధిని దర్శించారు. దీనికితోడు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం సంజయ్ గాంధీని గుర్తుచేసుకుంటూ - తమ ట్వీట్లతో ఘన నివాళులు అర్పించడం విశేషం. దీనికితోడు వారు వరుణ్ గాంధీని రహస్యంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని చూస్తుంటే సోనియాగాంధీ - మేనకాగాంధీల మధ్య వైరం సద్దు మణిగి - సయోధ్య కుదిరినట్లు కనిపిస్తోంది. అయితే ఇదంతా చాపకింద నీరులా జరుగుతోందని తెలుస్తోంది.
గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ప్రియాంకా గాంధీ - తన సోదరుడు వరుణ్ గాంధీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపధ్యంలో తానేమీ తక్కువ కాదంటూ వరుణ్ గాంధీకూడా ఆమెపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ తరువాత నుండి వారు కొంత జాగ్రత్త పడుతూ కుటుంబ సంబంధాలను కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే గాంధీ కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే వివాహ శుభకార్యాల సందర్భంలోనూ ఇరు కుటుంబాల వారు కలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రియాంకాగాంధీ - వరుణ్ గాంధీలు మరింత చేరువై తరచూ కలసుకుంటున్నారు. అయితే వీరు కలుసుకునే సందర్భాల్లో రాజకీయ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా కాంగ్రెస్ ఈ ట్వీట్ చేయడం వెనుక రెండు ఉద్దేశాలుండవచ్చని తెలుస్తోంది. ఒకటి వరుణ్ గాంధీని కవ్వించడం. రెండోది ప్రస్తుతం బీజేపీలో వరుణ్ గాంధికీ సన్నగిల్లుతున్న సయోధ్యను తమకు సానుకూలం చేసుకోవడం. కాగా వరుణ్ గాంధీ ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం విదితమే! ఈ నేపధ్యంలోనే ఆ పార్టీ వరుణ్ ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తోడ్పాటును తీసుకోవడంతోపాటు, గాంధీ కుటుంబం ఐక్యంగానే ఉందని చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇరు కుటుంబాలు కలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ యోచిస్తోంది. వరుణ్ వాగ్ఢాటిని ఈ ఎన్నికల్లో వాడుకోవాలని, దీనికి తోడు సోనియా - రాహుల్ - ప్రియాంకల ప్రచారం కూడా కలిసివస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. జెడియు - తృణమూల్ - ఆప్ లు ఏకమై బిజెపిని ఎదురొడ్డాలని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ కూడా గాంధీ కుటుంబం పేరుతో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనుకుంటోందంటున్నారు.