తెలంగాణలో మునుగోడుకు జరగనున్న ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తరఫున మునుగోడు నుంచి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి దిగారు. ఇక అధికార టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలో నిలిచారు.
ఈ నేపథ్యంలో విజయం సాధించి తమ సత్తా చాటడానికి అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. భారీ ఎత్తున ధనం, మద్యం పారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క ఉప ఎన్నికకే అన్ని పార్టీలు రూ.300 కోట్లు ఖర్చు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇక అయారాంలు గయారాంలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి గోడలు దూకుతున్నాయి. ఇవ్వాళ ఒక పార్టీలో ఉన్న నేత సాయంత్రానికి ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియనంత స్థాయికి రాజకీయ నేతలు దిగజారారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా మునుగోడులో బీజేపీకి ఓట్లేయాలంటూ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తలకు సూచించారంటూ ఒక ఆడియో కాల్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజు నోటీసు జారీ చేసింది. మరోవైపు కీలకమైన ఉప ఎన్నిక వేళ నియోజకవర్గంలో ప్రచారంలో పాలుపంచుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుటుంబంతో సహా ఆస్ట్రేలియాకు చెక్కేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిప్పులు చెరిగారు. వెంకటరెడ్డి ఓ దుర్మార్గుడని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని వెంకటరెడ్డి ఎలా ప్రచారం చేస్తారని సీతక్క నిలదీశారు.
తన తమ్ముడు రాజగోపాలరెడ్డే గెలవాలని వెంకటరెడ్డి అనుకుంటుంటే కాంగ్రెస్ కండువాకు బదులుగా బీజేపీ కండువా వేసుకోవాలని సీతక్క మండిపడ్డారు. తన నియోజకవర్గంలో పరిధిలో అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుంటే కష్టకాలంలో పార్టీకి అండగా నిలవకుండా ఆస్ట్రేలియాకు వెళ్లడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
కాగా మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎత్తకుండా మండిపడ్డారు. కాంగ్రెస్ భిక్షతో గెలిచి వేరే పార్టీకి ఓట్లేయమని చెబుతున్నారని ధ్వజమెత్తారు.
మరోవైపు రేవంత్‌రెడ్డే సీతక్కతో మాట్లాడిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తనను కాదని రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీర్ణించుకోలేకే ఇలాంటి చేష్టలకు దిగుతున్నారని రేవంత్ అనుచరులు విమర్శిస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా తప్పిస్తారని.. ఆ పదవిని తర్వాత తనకు ఇస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. అందుకే కాంగ్రెస్‌కు ఆయన మద్దతు ఇవ్వకుండా, లోలోప తమ్ముడికి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.